https://oktelugu.com/

Manoj Manchu: మరో సంచలన ఫ్యామిలీ వీడియో విడుదల చేసిన మనోజ్..!

Manoj Manchu: ఫేడ్ అవుట్ దశలో ఉన్న మంచు హీరోలు సినిమాలతో కాకుండా వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. మంచు ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మోహన్ బాబు స్వయంకృషితో ఎదిగి ఒక లెగసి క్రియేట్ చేశారు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద తన ముద్ర వేశారు. ఆయన వారసులు మాత్రం పూర్తిగా విఫలం చెందారు. కనీసం ఒక స్థాయి హీరోలు కూడా కాలేకపోయారు. మరి ఇంత పెద్ద బ్యాక్ […]

Written By: , Updated On : April 3, 2023 / 05:54 PM IST
Follow us on

Manoj Manchu

Manoj Manchu

Manoj Manchu: ఫేడ్ అవుట్ దశలో ఉన్న మంచు హీరోలు సినిమాలతో కాకుండా వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. మంచు ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మోహన్ బాబు స్వయంకృషితో ఎదిగి ఒక లెగసి క్రియేట్ చేశారు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద తన ముద్ర వేశారు. ఆయన వారసులు మాత్రం పూర్తిగా విఫలం చెందారు. కనీసం ఒక స్థాయి హీరోలు కూడా కాలేకపోయారు. మరి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా వెనుకబడిపోవడం దారుణ పరిణామం.

ఇటీవల మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో బ్రదర్స్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయని అర్థమైంది. ఇది ఫ్రాంక్ వీడియో అని విష్ణు కవర్ చేసే ప్రయత్నం చేశారు. మేము చేయబోతున్న హౌస్ ఆఫ్ మంచూస్ అనే రియాలిటీ షోలో భాగంగా మనోజ్ వీడియో పోస్ట్ చేశాడని విష్ణు పరోక్షంగా వెల్లడించారు. హౌస్ ఆఫ్ మంచూస్… ప్రోమో విడుదల చేశారు. జనాలు మాత్రం ఇది నమ్మలేదు. డ్యామేజ్ కంట్రోల్ లో భాగమే అని మాట్లాడుకుంటున్నారు.

అలాగే హౌస్ ఆఫ్ మంచూస్ షో గురించి మాకు తెలియదు, అసలు సంబంధం లేదని మనోజ్, లక్ష్మి చెప్పినట్లు సమాచారం. కాబట్టి విష్ణు-మనోజ్ లకు ఏదో విషయంలో బాగా చెడింది. అది బహిరంగంగా వాదులాడుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలో మనోజ్ సోషల్ మీడియా పోస్ట్స్ కాక రేపుతున్నాయి. ఆయన ఎప్పుడు ఎలాంటి సంచలన వీడియో పోస్ట్ చేస్తారో? అనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా నేడు మనోజ్ మరో వీడియో షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సదరు వీడియో వైరల్ అవుతుంది.

Manoj Manchu

Manoj Manchu

అయితే ఈ వీడియో తన వ్యక్తిగతమైంది. మార్చి 3న భూమా మౌనికతో ఆయనకు వివాహమైంది. ఏప్రిల్ 3తో ఒక నెల పూర్తి అయ్యింది. ఈ సంధర్భంగా భార్యతో కలిసి నడుస్తున్న ఓ రొమాంటిక్ వీడియో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ‘ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ జోడించారు. మనోజ్-మౌనికల రొమాంటిక్ వీడియో వైరల్ అవుతుంది. కాగా మౌనికతో మనోజ్ కి ఇది రెండో వివాహం. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి. చాలా కాలంగా వీరికి పరిచయం ఉంది. గత ఏడాది తమ రిలేషన్ రివీల్ చేశారు.