
తెలంగాణ గాయకురాలిగానే కాదు.. మంచి డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటుకుంటోంది మంగ్లీ.. చిన్న పాటలతో మొదలైన ప్రస్థానం ఇప్పుడు టాప్ సినిమాల్లో పాడేదాకా సాగిది. ఇటీవల మంగ్లీ పాడిన పాట ‘సారంగదరియా’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. ఇప్పటికే పలు సాంగ్స్ పాడిన మంగ్లీ తన వాయిస్ తో ‘సారంగదరియా’ను అదరగొట్టింది. ఈ పాట పాడిన మంగ్లీ సైతం ఈ పాటకు స్టెప్పులు వేసింది. తాజాగా ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఈ వీడియో సైతం పాపులర్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మీరు పాడిన పాటకు మీరే డ్యాన్స్ చేయడం ఎంతో ఎగ్సైట్ మెంట్ గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..
ఇక ఈ సినిమాను ఏరికోరి మరీ శేఖర్ కమ్ముల తన సినిమాలో వాడుకున్నారు. ప్రతీ సినిమాలో కొత్త నటులతో ప్రయోగాలు చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ సినిమా తీస్తున్నారు. గతంలో ‘ఫిదా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆయన తాజాగా నాగ చైతన్య, సాయిపల్లవిని పెట్టి సినిమా తీయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ సంచలన విజయం సాధించింది. ‘సారంగదరియా’ అంటూ వచ్చే ఈ పాట కుర్రాళ్లకు ఊపెక్కిస్తుంది.
వాస్తవానికి ‘సారంగదరియా’అనే పాటను కోమలి అనే సింగర్ రాసి పాడింది. కానీ లవ్ స్టోరీ సినిమాకు ఈ సాంగ్ నెట్టింట్లో హల్ చల్ చేయడంతో కోమల ఈ పాట తనదేననడంతో వివాదమైంది. అయితే చివరకి సర్ది చెప్పారు. లవ్ స్టోరీ సినిమా కోసం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తీసిన సీన్లు హైలెట్ గా మారాయి. ఈ పాటకు సాయిపల్లవి స్టెప్పులు వేస్తుంది. ‘సారంగదరియా’ను సుద్దాల అశోక్ తేజ రాసివ్వడంతో మంగ్లీ పాడారు. ఇదిలా ఉండగా ఈ సాంగ్ పై సెలబ్రెటీలు సైతం స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
వీడియో