Manchu Manoj: మంచు ఫ్యామిలీలో విబేధాలు తలెత్తాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారట. మనోజ్ ప్రేమ, పెళ్లి వ్యవహారమే విబేధాలకు కారణం అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో కుంపటి రగిలిన మాట నిజమే అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల మంచు విష్ణు బర్త్ డే జరుపుకున్నారు. అన్నకు మనోజ్ ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. జిన్నా ప్రీ రిలీజ్ వేడుకలో ‘జారు మిఠాయా’ సాంగ్ పాడిన భారతమ్మను కలిసి ఆ పాట పాడించాడు మనోజ్. ఆ వీడియో షేర్ చేసి విష్ణుకు బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

అలాగే విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా , వివియానా బర్త్ డే నేపథ్యంలో మరోసారి మనోజ్ సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ పోస్ట్ చేశాడు. ఈ రెండు సందర్భాల్లో మనోజ్ బర్త్ డే విషెస్ కి విష్ణు స్పందించలేదు. తిరిగి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అదే సమయంలో మనోజ్ హైదరాబాద్ లో ఉండటం లేదట. కొన్నాళ్లుగా ఆయన ఇంటికి దూరంగా ఉంటున్నాడట.
ఈ విబేధాలకు కారణం భూమా మౌనికతో మనోజ్ సన్నిహితంగా ఉండటమే అంటున్నారు. వినాయక చవితి పండుగ సమయంలో మనోజ్ భూమా మౌనికతో పాటు గణేష్ మండపాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంఘటన మీడియాలో హైలెట్ అయ్యింది. అసలు మనోజ్, భూమా మౌనిక కలవడమేంటని ఆరాలు మొదలయ్యాయి. మౌనికను ప్రేమించిన మనోజ్ ఆమెను రెండో వివాహం చేసుకుంటున్నాడనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నంద్యాల రాజకీయాల్లో చక్రం తిప్పిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండో కుమార్తెనే ఈ మౌనిక. పేరెంట్స్ ఇద్దరూ మరణించారు. మౌనిక అక్క అఖిల ప్రియ టీడీపీలో చేరి మంత్రి పదవి అందుకున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ సంబంధం పట్ల ఆసక్తిలేని మోహన్ బాబు, విష్ణు… మనోజ్ ని హెచ్చరించారని, అయినా తను ససేమిరా అన్నాడని వినికిడి. మౌనికతో పెళ్ళికి సిద్ధమైన మనోజ్ తీరు కుటుంబ సభ్యులకు నచ్చలేదట. ఇదే మంచు ఫ్యామిలీలో చీలికలకు కారణమైందట. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణతి రెడ్డితో 2019లో మనోజ్ కి విడాకులు అయ్యాయి.