Bigg Boss Season 6 TRP Rating: మన తెలుగు లో వర్కౌట్ అవుతుందో లేదో అనే సందేహం తో ప్రారంభించిన బిగ్ బాస్ షో, అందరి అంచనాలను అధిగమించి సీజన్ 1 భారీ హిట్ అయ్యింది..తెలుగు పేక్షకులకు ఈ రియాలిటీ షో సరికొత్తగా ఆసక్తికరంగా అనిపించడం తో బాగా అడిక్ట్ అయిపోయారు..సీజన్ 1 భారీ హిట్ అయ్యేలోపు వరుసగా నాలుగు సీజన్స్ ని నిర్వహించగా నాలుగు సీజన్స్ కూడా ఒక దానిని మించి ఒకటి బంపర్ హిట్ అయిపోయింది..అలా సీజన్ 6 కూడా సూపర్ హిట్ అయిపోతుందని భారీ ఆశలతో ప్రారంభించారు.

కానీ ప్రారంభ ఎపిసోడ్ నుండే ఈ సీజన్ కి టీఆర్ఫీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి..దానికి కారణం కంటెస్టెంట్స్ ఈసారి పెద్దగా ఆడియన్స్ కి ముఖ పరిచయం లేనోళ్ళు అవ్వడమే..దానికి తోడు నాలుగు సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున మాత్రమే హోస్ట్ గా కనిపించడం తో జనాలు బాగా బోర్ ఫీల్ అయిపోయారు..అందుకే ప్రారంభ ఎపిసోడ్ కి కేవలం 7.5 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.
అంతకు ముందు సీజన్స్ ప్రారంభ ఎపిసోడ్ కి 15 కి పైగానే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి..వాటితో పోలిస్తే సీజన్ 6 రేటింగ్స్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు..ఇక మాములు ఎపిసోడ్స్ ద్వారా అయినా ఆసక్తికరమైన టాస్కులతో రేటింగ్స్ పెంచుతారా అంటే అది కూడా జరగలేదు..ప్రారంభం లో టాస్కులు చాలా నత్తనడకన సాగాయి..కంటెస్టెంట్స్ ఒక్కరిలో కూడా ఆడాలి అనే కసి కనపడలేదు..దాని ఫలితంగా ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

అంతే కాకుండా ఈ సీజన్ లో ఏది కూడా న్యాయబద్దం గా సాగడం లేదని ప్రేక్షకుల్లో ఒక నెగటివిటీ ఏర్పడింది..అందువల్ల చాలామంది వీక్షకులు ఈ సీజన్ ని చూడడమే మానేశారు..ఇక వారం టికెట్ 2 ఫినాలే టాస్కు అయితే మరీ ఘోరం..ఏకాభిప్రాయం పేరిట కంటెస్టెంట్స్ తో పాటుగా ప్రేక్షకులకు కూడా చిరాకు రప్పించేసాడు బిగ్ బాస్..సీజన్ 6 ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఇక తర్వాత సీజన్స్ కొనసాగుతాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది.