Manchu Manoj: హీరో మంచు మనోజ్ రెండు రోజులుగా జనాలను ఊరిస్తున్నారు. తన లైఫ్ కి సంబంధించిన కీలక ప్రకటన చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జనవరి 20వ తేదీ ఉదయం 9:45 నిమిషాలకు చెప్పినట్లే మంచు మనోజ్ ఓ న్యూస్ పంచుకున్నారు. అయితే అది జనాలు ఊహించినది కాదు. దానికి భిన్నంగా కొత్త మూవీ ప్రకటన చేశారు. వాట్ ది ఫిష్ టైటిల్ తో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో కొత్త మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. డార్క్ కామెడీ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వాట్ ది ఫిష్ తెరకెక్కనుంది.

చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ మేకప్ వేసుకోనున్నారు. ఆయన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు. 2017లో ఈ చిత్రం విడుదలైంది. అనంతరం ఆయన కొన్ని చిత్రాల్లో క్యామియో రోల్ చేశారు. 2020లో మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అనంతరం ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని అందరూ భావించారు. అయితే మూవీ ఆగిపోలేదు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని మనోజ్ స్పష్టత ఇచ్చారు.
సడన్ గా వాట్ ది ఫిష్ మూవీ ప్రకటన చేశారు. దీంతో అహం బ్రహ్మస్మి ఇక లేనట్లే అనిపిస్తుంది. లేదంటే ముందు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచలో మనోజ్ ఉన్నారేమో. ఇక కొత్త మూవీ విశేషాలు పక్కన పెడితే… అసలు జనాలు ఆశించిన విషయం మాత్రం వేరే ఉంది. ఆయన ట్వీట్స్ రెండో పెళ్లి ప్రకటన గురించని అనుకున్నారు. కొన్ని నెలలుగా విష్ణు-భూమా మౌనిక కలిసి కనిపిస్తున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ డైవర్స్ అయ్యాయి. ఒంటరిగా ఉంటున్నారు.

అలాగే మొదటి వివాహాలు జరగకముందే పరిచయం ఉందట. అప్పుడు వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారట. కొన్ని కారణాలతో వేరే వ్యక్తులతో మనోజ్, మౌనికల వివాహాలు జరిగాయి. 2019లో మనోజ్ భార్యతో విడిపోయారు. అలాగే మౌనికకు భర్తతో విడాకులు అయ్యాయి. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలి నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మనోజ్ స్పందించలేదు. మౌనికతో వివాహం ఇష్టం లేని మంచు ఫ్యామిలీ అతన్ని దూరం పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది.
https://twitter.com/HeroManoj1/status/1616288308874838016