
Manchu Lakshmi- Manoj Marriage: కొన్ని నెలలుగా మంచు మనోజ్ పెళ్లి హాట్ టాపిక్ గా ఉంది. భూమా మౌనికతో ఆయన వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. గత ఏడాది వినాయక చవితి పండగవేళ గణేష్ మండపాన్ని మనోజ్-మౌనిక జంటగా సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడే మనోజ్ సెకండ్ మ్యారేజ్ పుకార్లకు బీజం పడింది. అప్పటి నుండి మనోజ్, మౌనిక కలిసి కనిపిస్తున్నారు. మనోజ్ ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాని స్పష్టంగా తెలుస్తుంది. మనోజ్ 2019లో విడాకులు తీసుకున్నారు. మౌనిక కూడా చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
Also Read: Bigg Boss 7 Telugu: విడాకులు తీసుకున్న జంటలతో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్
ఆ మధ్య మనోజ్ చేసిన కొన్ని ఇండైరెక్ట్ సోషల్ మీడియా పోస్ట్స్ పెళ్లి గురించే అన్న అపోహ కలిగించాయి. అధికారికంగా ప్రకటించకున్నా మౌనిక-మనోజ్ రిలేషన్ లో ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి స్నేహం ఇప్పటి కాదట. పెళ్ళికి ముందే మనోజ్, మౌనిక మిత్రులట. ఇక మౌనికతో వివాహం ఇష్టం లేని మోహన్ బాబు కుటుంబం మనోజ్ ని దూరం పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. కొన్నాళ్లుగా మనోజ్ హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో ఉండటం లేదట. విభేదాలతో మనోజ్ ఇల్లు విడిచిపోయాడంటున్నారు.
ఇక మనోజ్ వివాహంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలో అక్క మంచు లక్ష్మిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 12న మంచు లక్ష్మి శ్రీకాళహస్తి వచ్చారు. దర్శనం అనంతరం గుడి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోజ్ రెండో పెళ్లి గురించి అడగ్గా… ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మనోజ్ పెళ్లి గురించి స్పష్టత కావాలంటే తననే అడగండి. అది నా పరిధిలో లేని అంశం. గుడిలో ఏదైనా వృత్తిపరమైన విషయాలు ఏమైనా అడగండి, వ్యక్తిగత విషయాలు వద్దని సమాధానం చెప్పారు .

అగ్ని నక్షత్రంతో పాటు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని మంచు లక్ష్మి తెలిపారు. టీచ్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో కోసం ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నాము. 40 మంది సెలబ్రిటీలు ఈ సోషల్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ఎన్జీవో తరపున 45 వేల మంది విద్యార్థులకు సహాయం చేబోతున్నామని మంచు లక్ష్మి తెలిపారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర చేస్తున్నారు. శివరాత్రి కానుకగా ఓ సాంగ్ విడుదల చేయనున్నారట.
Also Read:Jagapathi Babu: ఏకంగా రూ.1000 కోట్ల ఆస్థి పోగొట్టుకున్న జగపతిబాబు… కారణం అదేనట!