Manchu Lakshmi: నటి మంచు లక్ష్మి లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. తాను కీలక రోల్ చేసిన మాన్స్టర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాన్స్టర్ మూవీని ఉద్దేశిస్తూ మీడియాతో మాట్లాడారు. మంచు లక్ష్మి హీరో మోహన్ లాల్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోలు ఇలాంటి కాంట్రవర్సీ సబ్జక్ట్స్ చేయడానికి ఇష్టపడరు. మనకెందుకులే అని పక్కన పెట్టేస్తారు. కానీ మోహన్ లాల్ ధైర్యంగా ఈ చిత్రం చేశారు. ప్రతి ఏడాది ఆయనతో కనీసం ఒక మూవీ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇదే విషయాన్ని ఆయనకు చెప్పాను.

మాన్స్టర్ మూవీలో నా క్యారెక్టర్ పేరు మంజు దుర్గ. చాలా మంచి పాత్ర దక్కింది. నా పాత్ర స్క్రిప్ట్ లో చెప్పినట్లు ఎలాంటి మార్పులు, ఎడిటింగ్ లు లేకుండా తెరకెక్కిస్తారు కదా? అని అడిగాను. కొన్నిసార్లు మనకు చెప్పిన స్క్రిప్ట్ కి తెరకెక్కించేదానికి చాలా తేడా ఉంటుంది. నేను సెట్లో చాలా ఎనర్జిటిక్ గా ఉండేదాన్ని. పాత్ర ప్రకారం మీరు కొంచెం డల్ గా ఉండాలని చెప్పేవారు. పాత్ర మూడ్ ని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది.
అలాగే మలయాళ భాష అర్థం కాక కొన్ని రోజులు ఇబ్బందిపడ్డాను. తర్వాత అలవాటు పడ్డాను. ఇతర భాషల్లో కూడా నటించి ఎంటర్టైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాది నాపై పెద్దగా ట్రోల్స్ రాలేదు. నేను ట్రోలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను. ప్రస్తుతం… లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గ్యాంబ్లర్ చిత్రాల్లో నటిస్తున్నాను, అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

అగ్ని నక్షత్రం మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాగా మాన్స్టర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. మలయాళంలో ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. కాగా మంచు లక్ష్మి ఈ మూవీలో లెస్బియన్ రోల్ చేయడం మరో విశేషం. ఆమె కొన్ని లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాన్స్టర్ తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చింది. మాన్స్టర్ మూవీలో మంచు లక్ష్మి పాత్ర చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.