Manchu Lakshmi: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ తో ప్రేక్షకులకు చేరువైంది మంచు లక్ష్మీ. పలు డిఫెరెంట్ సినిమాలు, క్యారెక్టర్లు చేస్తూ మెప్పిస్తోంది. ఇటు సినిమాలు.. అటు టీవీషోలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజి బిజీగా గడుపుతోంది. డిఫెరెంట్ భాషా ప్రయోగంతో మంచు లక్ష్మీ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
తాజాగా తన కొత్త సినిమా టైటిల్ ను మంచు లక్ష్మీ ప్రకటించింది. ‘అగ్నినక్షత్రం’ పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్లు వదులుతోంది. తాజాగా చిత్రంలోని మరో పాత్రను పరిచయం చేస్తూ మంచి లక్ష్మీ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. కేరళకు చెందిన ప్రముఖ నటుడు సిద్ధిక్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
‘అత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాంవర్మను పరిచయం చేస్తున్నా.. మోసపూరితమైన అతడి ఆలోచనలను అంచనావేయడం.. ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీసిద్ధిక్ మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం’ అంటూ మంచు లక్ష్మీ తిట్టిందో పొగిడిందో అర్థం కాకుండా పోస్ట్ చేసింది.
పాత్ర స్వభావాన్ని వివరించిందా? లేక సినిమాలోని నటుడు సిద్ధిక్ మోసగాడా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ ఏదో చెప్పబోయి.. మరేదో చెప్పిందంటూ సెటైర్లు వేస్తున్నారు. మంచి లక్ష్మీని సిద్ధిక్ మోసం చేశాడా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక అగ్నినక్షత్రం సినిమాలో తొలిసారి మంచు లక్ష్మీ, మంచు మోహన్ బాబులు కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసే ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ప్రమోషన్ లో భాగంగా మంచులక్ష్మీ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.