
Manchu Lakshmi Dance: దసరా మూవీలోని ‘చమ్కీల అంగీలేసి’ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. సంతోష్ నారాయణ్ ట్యూన్స్ కి తోడు సింగర్ ధీ వాయిస్ సాంగ్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ధీ స్వరం ఆ పాటకు విపరీతమైన ప్రాచుర్యం తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. నెటిజెన్స్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మంచు లక్ష్మి కూడా జాయిన్ అయ్యారు. ఆమె పింక్ కలర్ చీర కట్టి ‘చమ్కీల అంగీలేసి’సాంగ్ కి స్టెప్ వేశారు. మంచు లక్ష్మి అభినయం అలరించింది. ఇక సాంగ్ మధ్యలో కూతురు విద్య నిర్వాణ కూడా ఎంట్రీ ఇచ్చింది.
మంచు లక్ష్మి కూతురుతో కలిసి చేసిన ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అది విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. కాగా మంచు లక్ష్మి లేటెస్ట్ మూవీ అగ్ని నక్షత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర చేశారు. అగ్ని నక్షత్రం సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది.
మరోవైపు మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతున్నాయి. బ్రదర్స్ విష్ణు-మనోజ్ విడిపోయారు. విష్ణు తన వాళ్ళ మీద దాడి చేస్తున్నాడని ఆరోపణలు చేస్తూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. తండ్రి మోహన్ బాబు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయించారని సమాచారం. అప్పటికే ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి మీద సంస్థలు వైరల్ చేశాయి.

మార్చి 3వ తేదీన మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనికతో మనోజ్ కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. తమ రిలేషన్ పెళ్లితో అధికారికం చేసుకున్నారు. ఈ వివాహాన్ని మోహన్ బాబు, విష్ణు వ్యతిరేకించినట్లు సమాచారం. వారిద్దరినీ కాదని మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ వివాహం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మనోజ్-మౌనికల వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని నిమిషాల ముందు మోహన్ బాబు భార్యతో పాటు ఎంట్రీ ఇచ్చాడు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే… విష్ణు-మంచు లక్ష్మి మధ్య కూడా దూరం పెరిగిందని, ఆమె మనోజ్ పక్షం వహించారని అంటున్నారు.
View this post on Instagram