Vande Bharat Express : వందే భారత్ ఢీకొట్టి.. జింక రూపంలో వచ్చిన మృత్యువు.. ఈ వ్యక్తిని కబళించింది!

  Vande Bharat Express : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలయదు. అందుకే పెద్దలు వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదని చెబుతారు. విచిత్రమైన చావులు అనేకం చూస్తున్నాం. తాజాగా ఇలాగే విచిత్రమైన మరణం ఒకటి రాజస్థాన్‌లో సంభవించింది. మృత్యువు జింక రూపంలో వచ్చి రైల్వే విశ్రాంత ఉద్యోగి ప్రాణం తీసింది. అందేంటి జింక క్రూర మృగం కాదుకదా అని అనుకుంటున్నారా.. నిజమే కానీ, రైలు జింకను ఢీకొంటే అది ఎగిరొచ్చి పక్కనే నడుచుకుంటూ […]

Written By: NARESH, Updated On : April 20, 2023 2:41 pm
Follow us on

 

Vande Bharat Express : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలయదు. అందుకే పెద్దలు వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదని చెబుతారు. విచిత్రమైన చావులు అనేకం చూస్తున్నాం. తాజాగా ఇలాగే విచిత్రమైన మరణం ఒకటి రాజస్థాన్‌లో సంభవించింది. మృత్యువు జింక రూపంలో వచ్చి రైల్వే విశ్రాంత ఉద్యోగి ప్రాణం తీసింది. అందేంటి జింక క్రూర మృగం కాదుకదా అని అనుకుంటున్నారా.. నిజమే కానీ, రైలు జింకను ఢీకొంటే అది ఎగిరొచ్చి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతోపాటు వ్యక్తి కూడా మృతిచెందాడు.

-రాజస్థాన్‌లో ఘటన..

ఇటీవల మరణాలు విచిత్రంగా జరుగుతున్నాయి. అప్పటి వరకు మనతో కలిసి ఉన్న వ్యక్తులు కూడా రెప్పపాటులో చనిపోతున్నారు. కోవిడ్‌ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. పెళ్లి భరాత్‌లో నృత్యం చేస్తూ, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని, పాఠశాల, కళాశాలలో చదువుతూ రెప్పపాటులో కార్డిక్‌ అరెస్ట్‌ అయి మృతిచెందుతున్నారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారే రెప్పపాటులో లోకాన్ని వీడుతున్నారు. అయితే రాజస్థాన్‌లో మాత్రం రైల్వే విశ్రాంత ఉద్యోగికి మృత్యువు జింక రూపంలో ఎగిరొచ్చి కబళించుకుపోయింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని అల్వార్‌ జిల్లా కలిమోరి రైల్వే లెవల్‌ క్రాసింగు వద్ద వేగంగా వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలపై ఉన్న నీల్‌గాయ్‌ జింకను ఢీకొట్టింది. ఆ జింక గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో జింకతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందాడు. దీంతో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. జింక మీద పడి మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని రాజీవ్‌గాంధీ జనరల్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. రైలు దిల్లీ నుంచి అజ్‌మేర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

– వందేభారత్‌ క్షేమమేనా?

ఒకవైపు జింక, వ్యక్తి మృతిచెందగా కొంతమంది వందేభారత్‌ క్షేమమేనా అని సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో రెండు మూడు సార్లు వందేభారత్‌ రైలు గెదెలను ఢీకొని డ్యామేజ్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. రైలు తయారీ, నాణ్యతపై విమర్శలు వ్యక్తమవయ్యాయి. విపక్ష పార్టీలు మేకిన్‌ ఇండియా అంటే ఇదేనా అంటూ సెటైర్లు కూడా పేల్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్థాన్‌లో జింకను ఢీకొనడంతో వందేభారత్‌ ఎలా ఉంది అని కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదు. ఓ వన్యప్రాణి, ఓ మనిషి ప్రాణం మాత్రం పోయాయి.