Mallareddy : తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టే విధంగా చెప్పడంలో మల్లారెడ్డి సిద్ధహస్తులు. అందుకే ఆయనకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అంతటి కేటీఆర్ కూడా మల్లారెడ్డి మాట్లాడుతుంటే నవ్వుతూ వెంటాడు తప్ప.. ఆయనకు తగ్గట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయలేడు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు..”మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే
యాట కూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుందని” అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే మల్లారెడ్డి సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. అప్పట్లో ఆయన సంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు.. ఓ విలేఖరి ప్రశ్నకు “పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కష్టపడ్డ.. పైకి వచ్చిన” అని చేసిన వ్యాఖ్యలు ఆయనను ఒక్కసారిగా సంచలన వ్యక్తిగా మార్చాయి.
Also Read : జపాన్ లో జపనీస్ గా.. మల్లారెడ్డి లుక్ చూస్తే నవ్వకుండా ఉండలేరు
ఇప్పుడేమంటున్నారంటే..
ఇటీవల మల్లారెడ్డి సతీసమేతంగా జపాన్ వెళ్లారు. అక్కడ కూడా తన మార్క్ సింబాలిజాన్ని చూపించారు. జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చి.. సోషల్ మీడియాను షేక్ చేశారు. జపాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ తన రాజకీయాల్లో మల్లారెడ్డి బిజీ అయిపోయారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారం లేదు కాబట్టి.. ఎమ్మెల్యే గానే మల్లారెడ్డి కొనసాగుతున్నారు. గతంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. మల్లారెడ్డి తో ఓ యూట్యూబర్ నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. జపాన్ దేశానికి సంబంధించి వివరాలను సదరు యూట్యూబర్ అడిగితే .. అలా మాట్లాడుకుంటూ పోయిన మల్లారెడ్డి.. అక్కడ తగ్గిపోతున్న జనాభా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు..” జపాన్ జనాభా తగ్గిపోతున్నది.. అక్కడ పెళ్లిళ్లు అవుతున్నయి. సంతానోత్పత్తి జరగడం లేదు.. మొత్తంగా ప్రొడక్షన్ ఆగిపోయింది.. దేశం మొత్తం ఆగం ఆగం అవుతున్నదని” మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి విపరీతంగా నవ్వారు. ఇక ఆ వీడియో బిట్ సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.. సంతాన ఉత్పత్తిని ప్రొడక్షన్ తో పోల్చడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. ఇలాంటి వ్యాఖ్యలతోనే మల్లారెడ్డి సోషల్ మీడియా స్టార్ అయ్యారని.. ఇప్పుడు కూడా సోషల్ మీడియాను కొద్దిరోజుల పాటు ఆయన షేక్ చేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా మల్లారెడ్డి మరోసారి తన పర్సనల్ వివరాలను గొప్పగా చెప్పుకుంటూ పోయారు. తనకు తానే కేజిఎఫ్ సినిమా లెవల్ లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పైకి లేపుకున్నారు.
Also Read : హైడ్రా భూతాన్ని తెచ్చి హైదరాబాద్ ను ఆగం పట్టిచ్చిర్రు.. అసెంబ్లీలో ఏడ్చినంత పనిచేసిన మల్లారెడ్డి..