Homeట్రెండింగ్ న్యూస్Beer From Urine: మూత్రం, మురుగు నీటితో బీరు తయారీ.. యమా టేస్టీ అంటున్న మద్యం...

Beer From Urine: మూత్రం, మురుగు నీటితో బీరు తయారీ.. యమా టేస్టీ అంటున్న మద్యం ప్రియులు

Beer From Urine: ఎండలు మండుతున్నాయి. బయటకు వస్తే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఈ సమయంలో కూల్ కూల్ గా బీరు దొరికితే చటుక్కున తాగేస్తున్నారు మద్యం ప్రియులు. అందుకే వేసవిలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో బీరులదే అగ్రస్థానం. అందుకే మద్యం తయారీ కంపెనీలు సరికొత్త రీతిలో బీర్లు తయారుచేసి మార్కెట్లోకి అందుబాటులో తెస్తున్నాయి. జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ప్రస్తుతం మూత్రంతో బీరు తయారీ విధానం.. ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీనికి మురుగు నీటిని జత చేసి స్వచ్ఛమైన బీరును అందిస్తున్నారు. ఈ బీరు యమ టేస్టీగా ఉందంటూ మద్యం ప్రియులు ఫిదా అవుతున్నారట. ఇంతకీ ఈ బీరు ఎక్కడ తయారు చేస్తున్నారంటే.

Beer From Urine
Beer From Urine

మద్యం తయారీలో సింగపూర్‌ వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇక్కడి ‘న్యూబ్రూ’ బీరు.. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. ఈ బీరును మురుగు నీరు, మూత్రంతో తయారు చేయడం వల్లే ఇంత క్రేజ్ ఏర్పడింది.

Also Read: Pawan Kalyan CM Candidate: సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్.. బీజేపీ రూట్ మ్యాప్ లో సంచలన విషయాలు

మూత్రం, మురుగు నీటిని శుద్ధి చేసి.. అందులో జర్మన్‌ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతో పాటూ దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారట. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటిని సింగపూర్‌లో ‘నీవాటర్‌’ అని పిలుస్తారు. ఈ ‘న్యూబ్రూ’ బీరులో 95శాతం నీవాటర్‌ను ఉపయోగిస్తున్నారట. మాకు ఇలాంటి బీరే కావాలి, వారం అంతా పని చేసిన తర్వాత.. వారాంతంలో ఈ బీరు తాగితే హాయిగా ఉంటుందని చాలా మంది మద్యం ప్రియులు చెబుతున్నారట.

Beer From Urine
Beer From Urine

సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ (ఎస్ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ (పీయూబీ), స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్‌ను మార్కెట్ లోకి విడుదల చేశారు. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయోగం చేశామని ఎస్‌డబ్ల్యూడబ్ల్యూ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రపంచ వాప్తంగా చాలా దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ పరిస్థితులతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంది. దీంతో సింగపూర్ తరహాలోనే చాలా దేశాలు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. భారత్, చైనా, అమెరికాల్లో కూడా ఇలా నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు ఉన్నాయి.

Also Read:Renu Desai Second Husband: ‘రేణు దేశాయ్’ రెండో భర్త ఎవరు ? ఎందుకు కనిపించడం లేదు ?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular