
Dil Raju: దిల్ రాజు టాలీవుడ్ కింగ్ గా ఎదిగాడు. టాప్ ప్రొడ్యూసర్ హోదాలో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గ్యాంగ్ మైంటైన్ చేస్తున్నాడు. కేవలం డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు ఈ స్థాయికి ఎదగడం గొప్ప విషయం. ఈ అదే సమయంలో దిల్ రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మూవీ మాఫియాగా తయారై పరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో అపార అనుభవం ఉన్న దిల్ రాజు పరిశ్రమను శాసించే కీలక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నాడు. అదే థియేటర్స్.
చిన్నదైనా పెద్దదైనా సినిమా ఆడాలంటే థియేటర్స్ కావాలి. హీరో స్థాయిని బట్టి థియేటర్స్ సంఖ్య అవసరమవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ వ్యవస్థను నడిపిస్తున్న దిల్ రాజు నిర్ణయం మేరకే ఏ చిత్రానికి థియేటర్స్ దక్కుతాయి. అందుకే టాలీవుడ్ లో తెరకెక్కే చాలా చిత్రాలకు ఆయనే డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారు. దిల్ రాజుకు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ తోడై ఒక మాఫియా రన్ చేస్తున్నారు. దానికి దిల్ రాజు హెడ్.
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దెబ్బతీసే ప్లాన్ దిల్ రాజు వేశాడనేది ప్రధాన ఆరోపణ. తాను నిర్మించిన వారసుడు చిత్రానికి పెద్ద మొత్తంలో థియేటర్స్ లాక్ చేసి చిరంజీవి, బాలయ్యలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దానికి కారణం ఈ రెండు చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకు ఇవ్వకుండా సొంతగా విడుదల చేశారు. వారే డిస్ట్రిబ్యూటర్స్ అవతారం ఎత్తారు.
దిల్ రాజుతో విసిగిపోయిన మైత్రీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నచ్చని దిల్ రాజు నా సహాయం లేకుండా మీ చిత్రాలకు థియేటర్స్ ఎలా దొరుకుతాయో చూస్తా అని మొండి పట్టు పట్టారు. ఫైనల్ గా దిల్ రాజే నష్టపోయాడు. వారసుడు జనవరి 14వ తేదికి పోస్ట్ ఫోన్ చేయడంతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ సమస్య రాలేదు. దిల్ రాజు మీద మైత్రీ వాళ్ళ ఆగ్రహం కొనసాగుతుంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎదగడం ద్వారా దిల్ రాజును దెబ్బతీయవచ్చు, ఆధిపత్యానికి గండి కొట్టొచ్చని మైత్రీ ఆలోచనగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇతర చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. రంగమార్తాండ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన మైత్రీ భవిష్యత్తులో దిల్ రాజుకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.