Homeఎంటర్టైన్మెంట్Mahesh-Trivikram Movie: మహేష్ - త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్పుడే అయిపోయిందా..ఇంతే స్పీడ్ ఏమిటి సామీ!

Mahesh-Trivikram Movie: మహేష్ – త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్పుడే అయిపోయిందా..ఇంతే స్పీడ్ ఏమిటి సామీ!

Mahesh-Trivikram Movie
Mahesh-Trivikram Movie

Mahesh-Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొద్దీ రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుంతోంది.తివిక్రమ్ కి ఎంతో స్ట్రాంగ్ జోన్ గా అయినా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.అలా వైకుంఠపురం లో చిత్రం తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే కావడం తో ఈ మూవీ పై మార్కెట్ క్రేజ్ మామూలుగా లేదు.

ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్ 6 మిలియన్ డాలర్స్ కి అమ్ముడుపోయినట్టు సమాచారం.ఇది రీజినల్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు అనే చెప్పాలి.ఇందులో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీ లీల నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు అభిమానులకు పూనకాలు రప్పించేలా చేస్తుంది.

Mahesh-Trivikram Movie
Mahesh-Trivikram Movie

అదేమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం, ఒక్క పాట, రెండు ఫైట్స్ మినహా ఆగష్టు నెలలో పూర్తి అయిపోతుందట.ఎలా అయినా ఆగష్టు 11 వ తారీఖున ఈ సినిమాని థియేటర్స్ లోకి తెచ్చేందుకు కసిగా పనిచేస్తున్నారు దర్శక నిర్మాతలు.నిన్న గాక మొన్న మొదలైనట్టు ఉన్న ఈ సినిమా షూటింగ్ అంత స్పీడ్ గా అయిపోతుందా.పెద్దగా లొకేషన్స్ కూడా మారినట్టు అనిపించడం లేదు, ఒక్క ఇంటి సెట్ లోనే మొత్తం షూటింగ్ కానిచేస్తున్నారా? , అసలు ఏమి జరుగుతుంది అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు.

 

మహేష్ – త్రివిక్రమ్ మూవీ అంటే ఎంతో ప్రెస్టీజియస్ గా ఉండాలి కానీ,ఇలా చుట్టేసి వెంటనే విడుదల చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, అసలే ఈ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు అంటూ భయపడుతున్నారు.మరి త్రివిక్రమ్ టేకింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular