మహేష్ బాబు కొడుకు ఇలా చేశాడేంటి?

డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు.. యాక్టర్ కొడుకు యాక్టరే అవుతాడు.. కానీ అనూహ్యం.. సూపర్ స్టార్ ఫ్యామిలీ వారసుడు అయిన గౌతమ్ స్విమ్మర్ అయ్యాడు. కృష్ణ నటవారసత్వాన్ని నిలబెట్టిన మహేష్ బాబు తన కుమారుడిని మాత్రం తనకిష్టమైన ప్రవృత్తిని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్ లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ ఔరా అనిపించాడు. ఒక స్టార్ హీరో కొడుకు […]

Written By: NARESH, Updated On : June 17, 2021 7:04 pm
Follow us on

డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు.. యాక్టర్ కొడుకు యాక్టరే అవుతాడు.. కానీ అనూహ్యం.. సూపర్ స్టార్ ఫ్యామిలీ వారసుడు అయిన గౌతమ్ స్విమ్మర్ అయ్యాడు. కృష్ణ నటవారసత్వాన్ని నిలబెట్టిన మహేష్ బాబు తన కుమారుడిని మాత్రం తనకిష్టమైన ప్రవృత్తిని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాడు.

తాజాగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్ లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ ఔరా అనిపించాడు. ఒక స్టార్ హీరో కొడుకు ఇలా సినిమాల్లో కాకుండా ఒక రంగంలో పాపులర్ కావడం ఇదే ప్రథమం.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మహేష్ భార్య నమ్రత ఆనందం వ్యక్తం చేసింది. గౌతమ్ స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతున్న వీడియోను షేర్ చేసి అభిమానులను అలరించింది.

2018లో ప్రొఫెషనల్ స్విమ్మర్ గా మారిన గౌతమ్ 15 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. గౌతమ్ 3 గంటల్లో 5 కి.మీల దూరాన్ని ఈదగలడని.. బటర్ ఫై బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్టోక్. ప్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడుతాడని తెలిపారు నమ్రత.