Sarkaru Vaari Paata Movie Trailer: అవి 2019 ఎన్నికల సమయం.. చంద్రబాబు సీఎంగా.. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయం.. ప్రజల్లోకి పాదయాత్రగా వెళ్లి ప్రతిసభలోనూ జగన్ చెప్పిన ఒకే ఒక మాట.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’. ప్రజల బాధలు విన్నానని.. అధికారంలోకి వస్తే వాటన్నింటిని తీరుస్తానని జగన్ అన్న ఈ మాట వైరల్ అయ్యింది.
అయితే రాజకీయాలకు.. కౌంటర్లకు.. ఇతర సినీ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి మరో వివాదంలో ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇది పాజిటివ్ గా అయితే పర్లేదు. నో ప్రాబ్లం.. కానీ నెగెటివ్ గా ఉంటే మాత్రం మహేష్ బాబు సినిమా ‘సర్కారి వారి పాట’ ఆంధ్రాలో ఆడడం కష్టమే.
సర్కారి వారి పాట ట్రైలర్ తాజాగా విడుదలైంది. బ్యాంకింగ్ మోసాలపై ఈ కథ నడిచినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మోసం చేసిన వారిని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. అయితే హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేమ ట్రాక్ లో మహేష్ బాబు వాడిన డైలాగ్ ఇప్పుడు దుమారం రేపుతోంది.
జగన్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే డైలాగ్ ను హీరోయిన్ కీర్తి సురేష్ ను పడేయడానికి మహేష్ బాబు వాడాడు. ఆ మాట అనగానే కీర్తి గట్టిగా మహేష్ ను హగ్ చేసుకుంటుంది. ఈ డైలాగ్ ఆ సన్నివేశంలో పాజిటివ్ కోణంలో వాడితే పర్లేదు. కానీ ఎక్కడైనా తేడా కొట్టి నెగెటివ్ గా మారితే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రెచ్చిపోవడం ఖాయం. ఏపీలో సర్కారి వారి పాటకు థియేటర్లలో కష్టాలు ఖాయంగా కనిపిస్తోంది.
మరి సినిమా విడుదలైతే కానీ ఇది పాజిటివ్ కోణమా? లేక నెగెటివ్ కోణమా? అన్నది తెలియదు. ఇటీవలే టికెట్ల లొల్లిలో జగన్ ను కలిసిన చిరంజీవి బృందంలో మహేష్ కూడా ఉన్నాడు. జగన్ తో సరదాగా మాట్లాడాడు కూడా. ఈ క్రమంలోనే జగన్ కు వ్యతిరేకంగా తన సినిమాలో మహేష్ ప్రస్తావించకపోవచ్చని తెలుస్తోంది. సినిమా విడుదలైతే కానీ ఇది వివాదమో.. లేక జగన్ కు ప్రమోషనో తెలియదు మరీ. అప్పటివరకూ అందరూ వేచిచూడాల్సిందే.
Also Read: Rashmika Mandanna: రష్మికతో ఫస్ట్ రొమాన్స్, తర్వాత లవ్.. క్రేజీ అప్ డేట్ !