
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో బిజీగా మారాడు. ‘సర్కారు వారి పాట’తో హ్యాట్రిక్ హిట్టు కొట్టిన ఆయన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన డిఫరెంట్ లుక్స్ ఇప్పటికే రిలీజై ఆకట్టుకున్నాయి. వచ్చే సినిమాల్లో మహేష్ ను కొత్తగా చూస్తామని అందరూ అనుకుంటున్నారు. అభిమానులకు అనుగుణంగానే త్రివిక్రమ్ సైతం మహేష్ బాబును ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే #SSMB28 పేరుతో వస్తున్న ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2024లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో మహేష్ కు సంబంధించిన ఓ లేటేస్ట్ ఫొటో రిలీజైంది. అయితే ఈ ఫొటో పై ఆసక్తి చర్చ సాగుతోంది.
చేతిలో పప్పీ డాగ్ తో క్యూట్ గా కనిపిస్తున్న మహేష్ బాబు అప్ కమింగ్ మూవీలదేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం త్వరలో రాజమౌళి మహేష్ బాబుతో తీయబోయే సినిమాలోనిదని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత మహేష్ బాబుతో కలిసి సినిమా తీస్తానని జక్కన్న ఇదివరకే ప్రకటించారు. అయితే సినిమా వివరాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. అనూహ్యంగా మహష్ పిక్ ఒకటి రిలీజ్ కావడంతో అందరూ రాజమౌళి సినిమాకు సంబంధించినదేనని అనుకుంటున్నారు.
వాస్తవానికి అప్ కమింగ్ త్రివిక్రమ్ మూవీది అయితే ముందుగానే అనౌన్స్ చేసేవారు. కానీ ఆ మూవీ యూనిట్ వివరాలు ఏమి పెట్టలేదు. పైగా ఇందులో మహేష్ కొత్తగా ఉన్నాడు. కచ్చితంగా ఇది రాజమౌళి సినిమాకు సంబంధించిన ఫొటో అని అంటున్నారు. రాజమౌళి ఏం చేసినా సెన్షెషనల్ క్రియేట్ చేస్తారనే పేరుంది.గతంలో ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా ముందుగా అనౌన్స్ చేయకుండా సడెన్లీగా హీరోల ఫొటోలను రిలీజ్ చేశారు.
ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయాలని ఈ పిక్ ను వదిలారని అంటున్నారు. మరి జక్కన్న మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటో కనిపించడం లేదు. ఏదీ ఏమైనా ఈ పిక్ వివరాలు తెలియలాంటే కాస్త టైం తీసుకోవాలని మరికొందరు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత రాజమౌళి రేంజ్ విపరీతంగా పెరిగిపోంది. దీంతో ఆయన మహేష్ బాబుతో తీయబోయే సినిమా హై లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.