Mahesh Babu Namratha : మహేష్ బాబుకి ఈ ఏడాది ఎంత విషాదకరమైనదో మన అందరికి తెలుసు.. ఒకే ఏడాదిలో అన్నయ్య , తల్లి మరియు తండ్రి మరణించడంతో మహేష్ బాబు మానసికంగా చాలా కృంగిపోయాడు.. మానసిక స్థితి మెరుగుపడి, విషాదకరమైన సంఘటనలన్నీ మర్చిపోవాలంటే కేవలం పనిఒక్కటే మార్గం అని.. వెంటనే షూటింగ్ లో జాయిన్ అవ్వండి అంటూ మహేష్ కి ధైర్యం చెప్పిందట నమ్రత.. మహేష్ కూడా నమ్రత చెప్పినట్టు గానే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యాడు.. ఇటీవలే ఆయన మౌంటెన్ డ్యూ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు.. షూటింగ్ లో రెండు మూడు టేకులకంటే ఎక్కువ తీసుకోని మహేష్ బాబు,ఈ షూటింగ్ లో ఒక్క డైలాగ్ చెప్పడానికి 12 టేకులు తీసుకున్నాడట.
కారణం మహేష్ సంపూర్ణమైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడని.. ఇప్పటికి బాధలోనే ఉన్నాడని ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్త..తనకి కాస్త కోలుకునే టైం ఇవ్వొచ్చు కదా..ఎందుకు మా హీరోకి ఇబ్బంది కలిగించే సలహాలు ఇస్తున్నారు అంటూ నమ్రత ని ఇంస్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ చెయ్యబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కాళ్లకు గాయం అవ్వడం..ఆమెకి డాక్టర్లు మరింత విశ్రాంతి అవసరం అని చెప్పడం తో ఆమె ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనే సూచనలు కనిపించడం లేదు..అందువల్ల రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మొదటి వారం లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
ప్రస్తుతం మహేష్ బాబు దుబాయిలోని ఒక హోటల్ రూమ్ లో ఉన్నాడు.. ఆయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు థమన్ కూడా ఉన్నారు.. మహేష్ మరియు త్రివిక్రమ్ సమక్షం లోనే థమన్ పాటలు మొత్తం కంపోజ్ చెయ్యడం పూర్తి చేసినట్టు తెలుస్తోంది.. వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తున్న థమన్.. ఈ సినిమాకి కూడా అదిరిపొయ్యే ట్యూన్స్ ఇచ్చాడట..జనవరి నెలలో షూటింగ్ ప్రారంభించి..మార్చి నెలాఖరులోపు ముగించేయాలని ప్లాన్ చేస్తునట్టు సమాచారం.