
Mahesh Babu On Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, మహేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు టీవీ టెలికాస్ట్ ద్వారా ఆ రెండు చిత్రాలు అశేష ప్రజాధారణ పొందాయి.
అందుకే ఈ కాంబినేషన్ పై జనాల్లో అంత క్రేజ్ ఉంది.ఇది ఇలా ఉండగా అతిథి సినిమా వరకు మహేష్ బాబు యాక్టింగ్ మొత్తం తక్కువ మాటలు ఎక్కువ యాక్టింగ్ లాగ ఉండేది.కానీ మహేష్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం మాత్రం ‘ఖలేజా’ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు మహేష్ బాబు ఈ కోణం ఉండనే విషయం చాలా మందికి తెలియదు.
ఇక అప్పటి నుండి మహేష్ బాబు కూడా తన యాక్టింగ్ స్టైల్ ని ఖలేజా యాక్టింగ్ లాగానే ఉండేట్టుగా తనని తానూ మార్చేసుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోతున్న సినిమాలో కూడా మహేష్ ని సరికొత్త యాంగిల్ లో చూపించబోతున్నాడట. ఇప్పటి వరకు మహేష్ లో ఇంత మాస్ దాగుందా అని అభిమానులకు సైతం తెలియని కోణాన్ని మహేష్ నుండి ఆవిష్కరించబోతున్నాడట.

ఇందులో మహేష్ పాత్ర పచ్చి బూతులు కూడా మాట్లాడుతుందట, అంత మాస్ గా ఆయన క్యారక్టర్ ని తీర్చి దిద్దాడట త్రివిక్రమ్.ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న సినిమా అట ఇది.ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక క్యారక్టర్ ఊర మాస్, మరో క్యారక్టర్ పక్కా క్లాస్.శ్రీ లీల మరియు పూజ హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు.