
Amit Shah- RRR Team: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు యావత్తు భారత దేశ ప్రజలు ఎంతలా గర్వించారో మన అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇంతటి గౌరవం తీసుకొచ్చిన మూవీ టీం కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా సత్కరించాలి. కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ విషయాన్నీ అస్సలు పట్టించుకోలేదు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం #RRR టీం కి ప్రత్యేకంగా విందు ఇవ్వబోతుంది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 వ తారీఖున కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కి రానున్నాడు. ఈ సందర్భంగా #RRR మూవీ ని ప్రత్యేకించి ఆహ్వానించాడట హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఆదివారం రోజున అమిత్ షా ప్రత్యేక విమానం లో శంషాబాద్ విమానాశ్రయం కి చేరుకుంటాడు.అక్కడి నుండి హోటల్ నోవొటెల్ కి మూడు గంటల 30 నిమిషాలకు చేరుకుంటాడు.
ఆ సమయం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి , చంద్ర బోస్ మరియు కీరవాణి ని కలిసి వారిని ప్రత్యేకంగా సత్కరించి విందు భోజనం లో పాల్గొంటారు.అనంతరం ఆయన చేవెళ్ల లో జరిగే బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నాడు. ఇలా అమిత్ షా షెడ్యూల్ జరగనుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన మన దేశానికీ గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన #RRR మూవీ టీం ని విస్మయించలేదు. కానీ ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం కేవలం శుభాకంక్షలతో సరిపెట్టారు తప్ప,ఎలాంటి గౌరవ సత్కారాలు చెయ్యలేదు.

పీవీ సింధు బాడ్మింటన్ లో వెండి పతాకం గెలిచినందుకు రెండు ప్రభుత్వాలు ఆమెని ప్రత్యేకంగా సత్కరించాయి. మరి ఆస్కార్ అవార్డు కూడా అంతకు మించి గొప్ప,కలలో కూడా సాధ్యపడుతుందా లేదా అని అనుకుంటున్న సమయం లో గెలుచుకొచ్చిన ఆస్కార్ అవార్డు కి ఎలాంటి విలువ ఇవ్వలేదు రెండు ప్రభుత్వాలు. దీనిని బట్టీ సినీ కళాకారులు అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎంత చులకన అనేది అర్థం చేసుకోవచ్చు.