Madanapalle Incident: మగువ, మద్యం, మనీ మూడు మనిషికి ఎన్నో నష్టాలు తెస్తాయి. ఇందులో మద్యంతో చాలా ప్రమాదకరం. దాని మత్తులో దిగితే ఏదీ కనిపించదు. దేనిపై పట్టు ఉండదు. మద్యం మత్తులో చాలా మంది యువత ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. మన దేశంలో ఎక్కువ ప్రమాదాలు కూడా మద్యం తాగడంతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మద్యం బాటిళ్లపైనే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వం ఓ పక్క చెబుతూనే విక్రయిస్తోంది. ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే బంగారు బాతుగా మద్యం ఉండటం తెలిసిందే.

తాగుడు వల్ల అనర్థాలు వస్తాయని తెలుసు. కానీ నిషాలో ఉన్న వాడికి ఏదీ తెలియదు. దీంతో ఓ మనిషి విలువైన ప్రాణం గాల్లో కలిసింది. సరదాగా పండుగ జరుపుకుందామని వచ్చిన వారికి విషాదమే ఎదురైంది. ఈ నేపథ్యంలో కనుమ పండుగ సందర్భంగా మదనపల్లె రూరల్ లో ఆదివారం ఘనంగా ఉత్సవాలు జరిగాయి. దీనికి పెద్ద ఎత్తున విందులు, వినోదాలు చేసుకునేందుకు ప్రజలందరు సిద్ధమయ్యారు. దీంతో గొర్రెలు, మేకలు తీసుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఎల్లమ్మ ఆలయానికి వెళ్లారు.
Also Read: తీవ్రమైన పంటి నొప్పా.. క్షణంలో మాయం !
రాత్రి వేళ పొట్టేలును బలిచ్చేందుకు సిద్ధమయ్యారు. పొట్టేలును నరికేందుకు చలపతి అనే వ్యక్తి సిద్ధమయ్యాడు. దాన్ని గట్టిగా పట్టుకున్న సురేష్ అనే వ్యక్తి ని చలపతి మద్యం మత్తులో పొట్టేలుకు బదులు సురేష్ తలను కత్తితో వేటు వేశారు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మద్యం మత్తులో ఎలాంటి పని చేసినా హానికరమే.
కేవలం మద్యం మత్తులోనే సురేష్ ను చలపతి అంతమొందించినట్లు తెలుస్తోంది. బంధుమిత్రులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని భావించినా చివరకు నిరాశే మిగిలింది. మందు ఎంత ముప్పు తెచ్చింది. విలువైన ప్రాణాలు తీసింది. ఇప్పుడు పోయిన ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? అందుకే మద్యం తాగొద్దని ఎంత మొత్తుకుంటున్నా వినేవారే లేరు. అందుకే తీవ్ర నష్టాలు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు.
Also Read: క్యూలైన్లో నిలబడితేనే అంత సంపాదనా?