Love Today Closing Collections: ఈ ఏడాది పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే అందరికి భారీ లాభాల్ని తెచ్చిపెట్టాయి..అంతే కాకుండా టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా కూడా గట్టిగా నడించింది..KGF చాప్టర్ 2 , విక్రమ్ మరియు కాంతారా సినిమాలు ఇక్కడ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈ సినిమాల జాబితాలోనే మరో డబ్బింగ్ చిత్రం ‘లవ్ టుడే’ నిలిచింది.

తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కేవలం రెండు కోట్ల రూపాయలకే దక్కించుకున్నాడు..ముందుగా ఆయన రీమేక్ రైట్స్ కోసం తెగ ప్రయత్నాలు చేసాడు..కానీ రీమేక్ రైట్స్ ఇవ్వడానికి ఆ చిత్ర నిర్మాతలు ఒప్పుకోలేదు..ఇక చేసేది ఏమి లేక డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి తెలుగు లో విడుదల చేసాడు దిల్ రాజు..తమిళం లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో తెలుగులో కూడా అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం.
లవ్ స్టోరీస్ లో సరికొత్త కోణాన్ని తీసుకొని డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతం..యూత్ కి తెగ నచ్చేసింది..కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాదు , హీరోగా కూడా ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చాడు..ఇక వసూళ్ల విషయానికి వస్తే రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే 5 కోట్ల రూపాయిలు లాభం అన్నమాట..దిల్ రాజు ఈ సినిమాని నేరుగా రాష్ట్రవ్యాప్తంగా తన సొంత థియేటర్స్ లో విడుదల చేసుకున్నాడు..మధ్యలో బయ్యర్స్ ఎవ్వరూ కూడా లేరు..లాభాలు మొత్తం ఆయనకే..అదేంటో దిల్ రాజు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం అయ్యి కూర్చుంటుంది..తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రప్పించుకోవడం ఎలా అని దిల్ రాజు ని చూసి అందరూ నేర్చుకోవాలి.