Love Couple Sircilla: ప్రేమ ఎంతటి వారినైనా మైమరపిస్తుంది. దాని కోసం ఏమైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. కలిసి జీవించడానికైనా చావడానికైనా తెగింపు ఇస్తుంది. దీంతో నూరేళ్లు జీవించాల్సిన జీవితాన్ని అర్థంతరంగా ముగించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడదు. ఎందరో ప్రేమ మత్తులో పడి జీవితాలను శిథిలం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ను బంగారు ఆశలతో నిర్మించుకోవాల్సి ఉన్నా మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. ప్రేమ కోసం బతికి చూపించాల్సిన వారే తమకు బతుకు అక్కరలేదని అనంత లోకాలకు చేరుకుంటున్నారు. కలిసి జీవించాలని ఆశించినా కాలం కలిసి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫలితంగా కన్న వారికి శోకాలు మిగుల్చుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో రెండో వాడు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మూడో వాడు నామ వేణుగోపాల్ (24) ఓ ప్రైవేటు క్లినిక్ లో పని చేస్తున్నాడు. అదే క్లినిక్ లో పనిచేసే మచ్చ పూజ (26) పని చేస్తోంది. దీంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాలని భావించి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో పూజ తన మేనబావను చేసుకోవాల్సి వచ్చింది.
Also Read: Poorna Remuneration: మీకు పూర్ణ కావాలా ? ఐతే రోజుకింత ఇవ్వండి ?
దీంతో వీరి బంధం అలాగే కొనసాగింది. ఇద్దరు కలిసి తిరగడం ప్రారంభించడంతో విషయం ఇంట్లో తెలిసి గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కలిసి బతుకుదామంటే లోకం ఏమంటుందో అనే భయం విడిపోతే ఎలా బతుకుతామనే ఆందోళన కలగడంతో ఎటూ తేల్చుకోలేకపోయారు. పూజకు పెళ్లి కావడంతో వీరి భవిష్యత్ సందిగ్ధంలో పడింది. ఇక జీవితం వృథా అని బావించుకున్నారు. కలిసి జీవించడం కంటే మరణించడమే మేలని తలచారు.

మే 15న వారి ఇళ్లకు చేరకపోవడంతో పూజ భర్త తన భార్య అదృశ్యమైందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కలత చెందిన వారిద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బైక్ పై వచ్చి సిద్దిపేట జిల్లా ధర్మారం చౌరస్తా వద్ద ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కలసి జీవించలేకున్నా మరణించాలని అనుకున్న వారి ఉద్దేశాలు ఏవైనా కుటుంబాలకు మాత్రం శోకమే మిగిల్చారు. ప్రేమికులు ఎదిరించి పోరాడాలే కానీ పిరికివారిలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read:Konaseema Agitation ‘కోనసీమ’ నిప్పు అంటించడం వెనుక ఏముందో ఎవరికి ఎరుక?