London Wife and Husband: భార్యాభర్తలు కలిసి పనులు చేసుకుని సంసారం చేసి కుటుంబాన్ని పోషించుకుంటారు. ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం తెలిసిందే. ఎవరి అర్హతలకు తగిన ఉద్యోగం వారు చేస్తుంటారు. కానీ ఇక్కడో గమ్మత్తైన విషయం జరిగింది. ఓ మహిళ తన భర్తను అద్దెకు ఇస్తోంది. అద్దెకు సామను ఇవ్వడం చూస్తుంటాం. రకరకాల వస్తువులు అద్దెకు ఇస్తూ డబ్బులు సంపాదించడం తెలిసిందే. కానీ తన భర్త ఓ మంచి పనోడని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి అడిగిన వారికి తన భర్తను అద్దెకు ఇవ్వడం సంచనలం కలిగించింది.

భార్యలకు భర్తలు లొంగి ఉండటం సహజమే. కానీ ఇక్కడ జరిగిన విషయం పరిశీలిస్తే వింతైన అనుభవం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన భర్తను నగరంలోని మహిళలకు రోజుకు ఇంత పారితోషికం తీసుకుని అప్పగించడం చూస్తున్నాం. ఈ కోణంలో అతడి బాధలు వర్ణనాతీతం. అద్దెకు తీసుకెళ్లిన మహిళలకు ఏది చెబితే అది చేయడం అతని విధి. ఈ లెక్కన రోజుకు దాదాపు మన దేశ కరెన్సీ ప్రకారం ఓ మూడు వేల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Manjusha Rampalli: జబర్దస్త్ లో అనసూయ ప్లేసులో ఏం యాంకర్ ను తీసుకుంటున్నారో తెలుసా?
లండన్ లోని బంకింగ్ హామ్స్ నగరంలో లారా యంగ్ అనే వివాహిత ఉంటోంది. ఆమె తన భర్తను లీజుకిస్తూ డబ్బులు సంపాదిస్తోంది. వస్తువులను తాకట్టు పెట్టడం చూస్తుంటాం. కానీ ఆవిడ మాత్రం తన భర్తనే తాకట్టు పెడుతూ డబ్బు కూడబెట్టడం నిజంగా విశేషమే. ఈ క్రమంలో రెంట్ మై హ్యండీ హస్బండ్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించి తన భర్త సేవలను విక్రయిస్తోంది. మొగుడిని నమ్ముకున్న వారిని చూశాం కానీ అమ్ముకునే వారిని చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం.

ఖాళీ సమయాల్లో సైతం అతడి సేవలు ఉపయోగించుకోవడం కోసం అతడిని అమ్మకానికి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రతి రోజు అతడి సేవలను వినియోగించుకుంటూ ఆమె డబ్బులు సంపాదించడం కొసమెరుపు. మొత్తానికి భర్త సేవలను ఇలా వినియోగించే మహిళ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఆమె సాటి త్యాగం ఎక్కడ ఉండదని తెలుస్తోంది. దీంతో ఆమె తన భర్తను నిరంతరం అమ్ముతూనే తన సంపాదన పెంచుకోవడం నిజంగా విశేషమే.
Also Read:Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ’6 డేస్ కలెక్షన్స్’.. ఇది బిగ్ ప్లాప్ !