Unstoppable With NBK Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ ప్రభాస్ ఎపిసోడ్ నిన్న రాత్రి నుండి ఆహా మీడియా లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది..ఇప్పటి వరకు ఈ షో కి ఎంతో మంది హీరోలు వచ్చారు..హీరోయిన్లు వచ్చారు మరియు రాజకీయ నాయకులు కూడా వచ్చారు..కానీ ఎంతమంది వచ్చినా ఆహా మీడియా సర్వర్లు తట్టుకోగలిగాయి కానీ, ప్రభాస్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాయి..యాప్ క్రాష్ అయ్యి చాలాసేపటి వరకు వర్క్ చెయ్యలేదు.

దీనితో అభిమానులందరూ కంగారు పడ్డారు..కానీ కాసేపటి తర్వాత ఆ యాప్ లైవ్ అవ్వడం తో అందరూ వీక్షించారు..అయితే ఈ ఎపిసోడ్ కి వచ్చిన లైవ్ వ్యూయర్స్ కౌంట్ ఇప్పటి వరకు ఆహా మీడియా హిస్టరీ లో ఏ షో కి కూడా రాలేదని తెలుస్తుంది..అక్షరాలా పది లక్షల మంది ఈ షో ని 24 గంటలు కూడా గడవకముందే చూసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.
ఇక 24 గంటలు గడిచిన తర్వాత ఈ ఎపిసోడ్ కి 30 లక్షలకు పైగా వ్యూస్ వస్తాయని అంచనా వేస్తున్నారు..గతం లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షో కి హాజరయ్యాడు..ఆయన ఎపిసోడ్ కి అద్భుతమైన వ్యూస్ అయితే వచ్చాయి కానీ, ఈ రేంజ్ వ్యూస్ మాత్రం రాలేదు..దీనిని బట్టీ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది..ఆ ఎపిసోడ్ కి ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..కచ్చితంగా ఆహా మీడియా వారు తమ సర్వర్ కెపాసిటీ ని మరింత పంచాల్సిందే..ఇక ప్రభాస్ ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్ తో సాగిపోయింది..ఇది కేవలం మొదటి భాగం మాత్రమే..రెండవ భాగం జనవరి 6 వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుందని ఆహా మీడియా టీం అధికారిక ప్రకటన చేసింది.