Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు రోజుల ముందే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది..అంటే జనవరి 11 వ తేదీన అన్నమాట..దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది..ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జనవరి 14 వ తేదీ నుండి ప్రారంభించారు..ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల ప్రారంభించగా రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి.

కేవలం అమెరికా నుండే ఈ సినిమాకి మూడు లక్షల డాలర్లు ప్రీమియర్స్ నుండి వచ్చాయి..అంటే దాదాపుగా 15 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అన్నమాట..మెగాస్టార్ గత మూడు చిత్రాలైన సైరా నరసింహా రెడ్డి, ఆచార్య మరియు గాడ్ ఫాదర్ కంటే అద్భుతమైన బుకింగ్స్ ఇవి..ప్రీమియర్స్ ముగిసేలోపు కచ్చితంగా 8 లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
షోస్ పెంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకి 1 మిలియన్ డాలర్లు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పూర్తి స్థాయి బుకింగ్స్ ఓపెన్ చేస్తే కచ్చితంగా మొదటి ఈ చిత్రానికి తెలంగాణ ప్రాంతం నుండే 10 లక్షల రూపాయిల టికెట్స్ అమ్ముడుపోయే ఛాన్స్ ఉందంటున్నారు..సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత నైజాం ప్రాంతం లో మెగాస్టార్ కి అద్భుతమైన ఓపెనింగ్స్ ఈ సినిమాకే దక్కనున్నాయి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇక్కడ మెగాస్టార్ డిజాస్టర్ చిత్రం ఆచార్య కి కూడా అదిరిపొయ్యే ఓపెనింగ్స్ వచ్చాయి..ఇక ఇంత మంచి హైప్ ఉన్న ‘వాల్తేరు వీరయ్య’ కి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..మెగాస్టార్ మార్క్ కామెడీ , మాస్ తో నిండిపోయిన ఈ సినిమా అభిమానులను ఏ రేంజ్ లో అలరించబోతుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఓపిక పట్టాల్సిందే.