Dill Raju’s ‘Varasudu’ movie : ” తెలుగు సినిమా బాగుండటమే నాకు కావాల్సింది.. చిరంజీవి, బాలకృష్ణ నా హీరోలు. బాలకృష్ణ గారి అఖండ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాను. వారిద్దరి కోసమే వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నాను” ఇదీ ఈరోజు ప్రెస్ మీట్ లో దిల్ రాజు చెప్పిన మాటలు. వినేవాడు విలేఖరి అయితే చెప్పే వాడు నిర్మాత అన్నట్టు సాగింది దిల్ రాజు చెప్పిన విధానం. అంతటి ఉదాత్తుడే అయితే ఫిబ్రవరి 8న హఠాత్తుగా శాకుంతలం అనే సినిమాను ఎందుకు లైన్ లో పెట్టినట్టు? ఆ తేదీకి చినబాబు, బన్నీ వాసుల సినిమాలు విడుదల కానున్నాయి. వాటి తేదీని ఎప్పుడో ఖరారు చేశారు. అసలు విషయం ఏమిటంటే.. వారసుడు ట్రెయిలర్ తెలుగు జనాలకు అంతగా ఎక్కలేదు. తెలుగులో విజయ్ మార్కెట్ అంతంతే. ఆయనేం రజనీ కాంత్, సూర్య, కార్తీ మాదిరి ఫాలోయింగ్ ఉన్న నటుడు కాదు. అప్పుడెప్పుడో కత్తి అనే సినిమా తప్ప అతడి డబ్ సినిమాలు తెలుగులో అంతగా ఆడ లేదు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నుంచి వారసుడు సినిమాని దిల్ రాజు తప్పించినట్టు తెలుస్తోంది.

-ఎవరూ ఆనందంగా లేరు
ఇదే దిల్ రాజు వేమూరి రాధా కృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో “నా వారసుడు సినిమా ఎవరికీ పోటీ కాదు. నా థియేటర్లు ఇంకో సినిమాకు ఇచ్చే సహృదయత నాకు లేదు” అని పక్కా కమర్షియల్ మాటలు మాట్లాడాడు. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. సంక్రాంతి రేసు నుంచి వారసుడు సినిమాను తప్పిస్తున్నట్టు వెల్లడించాడు. అయితే దిల్ రాజు ధోరణితో తెలుగు నిర్మాతలు ఎవరు కూడా సంతోషంగా లేరు. హారిక హాసిని చినబాబు, చెరుకూరి సుధాకర్, బన్నీ వాసు, అశ్వనీ దత్.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ… అందరూ కూడా దిల్ రాజు బాధితులే. సినిమా థియేటర్లు ఆ నలుగురి చేతిలో బంధీ అయి ఉంటే ఎంత నష్టమో చిన్న నిర్మాతలకే కాదు, ఇప్పుడు పెద్ద నిర్మాతలకు కూడా తెలిసి వస్తోంది.
-రేసులో లేడని ఎవరన్నారు
తెలుగు సినీ నిర్మాతల్లో అల్లు అరవింద్ తర్వాత ఆ స్థాయిలో కమర్షియల్ నిర్మాత దిల్ రాజు. వారసుడు సినిమాని రేసులో నుంచి తప్పించి ఆయన సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది పూర్తి అబద్ధం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ యువీ క్రియేషన్స్ వారి ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.. ఈ సినిమాకి యూవీ వాళ్ళు ఐదు కోట్లకు అమ్మారు. ఎలాగూ సంక్రాంతి సీజన్ కాబట్టి .. చేతిలో థియేటర్లో ఉన్నాయి కాబట్టి ఆ సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాడు. ఇక ఆ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ ఏర్పడింది. గట్టిగా రెండు వారాలు నడిపిస్తే చాలు డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఈలోపు వారిసు ఎలాగూ తమిళ్ లో విడుదలవుతుంది. విజయ్ కి అక్కడ పెద్ద మార్కెట్ ఉండడంతో… దిల్ రాజుకు పెద్ద ఇబ్బంది ఉండదు. కొద్ది రోజులు గడిచాక వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలెక్షన్లు కూడా తగ్గుతాయి. అప్పటికి కొన్ని థియేటర్లు దొరుకుతాయి కాబట్టి.. వారసుడు సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తాడు. ఎలాగూ నిర్మాతల సిండికేట్ లో కీలక సభ్యుడు కాబట్టి… తన సినిమాని పెయిడ్ ప్రమోషన్లతో ఆడించుకుంటాడు. దండిగా వెనుకేసుకుంటాడు. సంక్రాంతి నుంచి వెనక్కి తగ్గడం వల్ల దిల్ రాజుకే లాభం ఎక్కువ. పైగా తమ సినిమాలకు థియేటర్లు కూడా ఇచ్చాడని బాలకృష్ణ, చిరంజీవి దృష్టిలో మంచి మార్కులు కూడా పడతాయి.. అంటే వన్ షాట్ టూ బర్డ్స్. దిల్ రాజు నువ్వు పక్కా కమర్షియల్ కాదు. అంతకు మించి..