Pandit Birju Maharaj: దేశం గర్వించే ప్రఖ్యాత కథక్ నృత్యకళాకారుడు ఇక లేడు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్(83) గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా.. కథక్ డ్యాన్స్ గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు.. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాసు సమ్మాన్ కూడా అందుకున్నారు.బనారస్ హిందూయూనివర్సిటీ, ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు కూడా బిర్జు మహారాజ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశాయి.

యూపీలోని లక్నోలోని కథక్ కుటుంబంలో బిర్జూ మహారాజ్ జన్మించారు. తండ్రి పేరు అచ్చన్ మహారాజ్. ఈయన మేనమామ పేరు శంభు మహారాజ్. వీరిద్దరూ ప్రఖ్యాత కథక్ కళాకారులు. 9 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో బిర్జూనే కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. అతడి మామ నుంచి కథక్ నృత్య శిక్షణ తీసుకొని డ్యాన్సు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు.
Also Read: 18 ఏళ్లకే ఎంపీగా రికార్డు సృష్టించిన తెలుగమ్మాయి.. ఎక్కడంటే..?
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు బిర్జూ నృత్యరీతులు సమకూర్చాడు. దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీరావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జు మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. ఇక సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’కి కూడా సంగీతం అందించారు.
ఇక విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి 2012లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 2016లో ‘మెహేరంగ్ దో లాల్’ పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు.
బిర్జూ మరణంపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. చాలా మంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
Also Read: దేశంలో కరోనా కల్లోలం: ఒక్కరోజులో 2.59 లక్షల కేసులు.. 358 మరణాలు