Senior Citizens: విలువైన సూత్రాలు అంటే.. ఎవరికీ తెలియని విషయాలు అని అర్ధం కాదు. అత్యవసరం అయిన దాన్ని విలువైనదే అనుకోవచ్చు. ఈ సూత్రాలు కావొచ్చు, నియమాలు కావొచ్చు. తప్పకుండా పాటించండి.

మీరు బాత్రూంలో ఉన్నప్పుడు లోపల గడియ పెట్టుకోవద్దు. మరి మీరు లోపల ఉన్నట్టు బయట వాళ్లకు తెలియాలి కదా ? తెలియడానికి మీకు ఏదైనా కూని రాగాలు వస్తే పాడండి, లేదా పద్యాలూ పాడుకున్నా సరే. అవేమి రావు అనుకుంటే.. మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో ఏదైనా పాట పెట్టుకోండి.
Also Read: ఆగిన మువ్వల సవ్వడి.. ప్రముఖ నృత్యకారుడు మృతి
తడిగా ఉన్న నేలపై నడువవద్దు. ఇప్పటి ఇళ్లల్లో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనబడవు. అందువల్ల కాలు పెడితే జారడం ఖాయం.
ఫ్యాన్ లు, ఫోటోలు తుడవడానికి గానీ , రిపేర్ చేయడానికి గానీ , గుడ్డలు ఆర వేయడానికి గానీ స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .
కారు గానీ , స్కూటర్ గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి.
మీరు వేసుకునే మందులు ఏమైనా ఉంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టైం మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీకు ముందు మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.
మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ, ఆనందపరిచే విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడొద్దు.
మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా మీ సహధర్మచారిణిని తీసుకు వెళ్ళండి.
ఇంట్లో మీరు ఒక్కరు ఉన్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి. వీలైనంత త్వరగా మాట్లాడి పంపించండి. జాగ్రత్తగా ఉండండి.
ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి. ఎప్పుడైనా అవసరం రావచ్చు.
ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి గానీ, జరిగే దాని గురించి గానీ, జరగబోయే దాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.
Also Read: టాలీవుడ్ కి దొరికిన మరో లక్కీ హీరోయిన్