
Tarakaratna Funeral: ఎంతో భవిష్యత్ ఉన్న సినీ నటుడు, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ప్రవేశించిన నందమూరి నట వారసుడు తారకరత్న ఆకస్మిక మరణం అందరినీ కలచివేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనవరి 27న చేపట్టిన యువగళం పాతయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న అక్కడే కుప్పకూలిపోయారు. 23 రోజుము మృత్యువుతో పోరాడి చివరకు ఈనెల 18న(శనివారం) ఓడిపోయారు. సోమవారం తారకరతన్న అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రముఖుల కడసారి నివాళి..
బెంగళూర్ నుంచి ౖహె దరాబాద్‌కు తారకరత్న భౌతికకాయాన్ని తీసుకొచ్చిన బందువులు ఆదివారం ఇంటివద్దనే ఉంచారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తెలుగు ఫిలిం చాంబర్స్‌కు తీసుకొచ్చారు. రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు అభిమానులు, ప్రజలు తారకరత్త పార్థీవదేహాన్ని సందర్శించి కడసారి వీడ్కోలు పలికారు. తారకరత్న మేనమామ, ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ, అత్త, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఫిల్మ్ చాంబర్స్‌లో నివాళులర్పించారు. సినీనటుడు వెంకటేశ్, ఆయన సోదరుడు, నిర్మాత సురేశ్‌బాబు కూడా తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి బంధువు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుండెలు పగిలేలా రోధించిన కూతురు..
తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు నిష్కా, రేయా, కుమారుడు తనయరామ్, ఇతర కుటుంబ సభ్యులు చివరి నివాళులు అర్పించే సమయంలో గుండెలు పగిలేలా రోధించారు. కూతురు నిష్కా అయితే తాత బాలకృష్ణ వద్దకు వెళ్లి నాన్న కావాలని కన్నీరు పెట్టుకోవడం కలచివేసింది. నాన్న ఇక రాడా అంటూ ఆమె బోరుమంది.

మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో సాయంత్రం 4:30 గంటలకు అత్యక్రియలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణ, మాజీ ఎంపీ పురందేశ్వరి, ఇతర ప్రముఖులు అంత్యక్రయలకు హాజరయ్యారు.