Tirupati Husband And Wife: తన భర్త వేరే అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తే ఏ భార్యయినా ఏం చేస్తుంది? ఇల్లు పీకి పందిరేస్తుంది. తన వాళ్ళని పిలిపించి పంచాయితీలు పెట్టిస్తుంది. కోపం పాళ్ళు ఎక్కువ ఉన్న స్త్రీ అయితే భర్తను కొట్టేందుకు కూడా వెనుకాడదు. కన్నవాళ్ళను, అయినవాళ్లను వదులుకొని, కేవలం పెళ్లి అనే ఒక రెండక్షరాల బంధంతో ఒక స్త్రీ పురుషుడితో మమేకమవుతుంది. జీవితాంతం తల్లిదండ్రి, స్నేహితుడు ఇలా అందర్నీ అతడిలో చూసుకుంటుంది. అతనికి ఏమాత్రం ఆపద కలిగినా తల్లడిల్లిపోతుంది. భార్య అంత గొప్పది కాబట్టే కార్యేషు దాసి కరణేశు మంత్రి అన్నారు పెద్దలు. అలాంటి భార్య తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని తెలిస్తే ఎలా ఊరుకుంటుంది.. అసలు ఊరుకోదు. కానీ అందరిలా కాకుండా తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉంది తెలిసిన ఈ భార్య మహిళలోకం విస్తు పోయే నిర్ణయం తీసుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే
కు చెందిన ఓ యుచిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం లోని డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ వకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతడికి టిక్ టాక్ లో ఒక యువతి పరిచయం అయింది. ఆమె స్వస్థలం విశాఖపట్నం. ఇద్దరి మనుసులు కలిశాయి. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటామనే ధీమాతో శారీరకంగా కలిశారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నాడు. అతడిని గతంలో ప్రేమించిన యువతి ఆ జ్ఞాపకాలనుంచి బయటపడడం వీలుకాక నేరుగా తిరుపతి వచ్చింది. అతని గురించి ఆరా తీయగా పెళ్లయిందని, భార్యతో కలిసి అంబేద్కర్ నగర్లో ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసి ఆమె బోరును విలపించింది. మరో యువతీ అయితే వెంటనే తిరిగి వచ్చేదేమో.. కానీ అతని జ్ఞాపకాలు ఆమె మనసును పదేపదే మెలిపెడుతూ ఉండడంతో తట్టుకోలేక ఒక నిర్ణయం తీసుకుంది. నేరుగా ఆ యువకుడి భార్యను కలిసింది.

గతంలో జరిగిన విషయం మొత్తం చెప్పింది. నేను కూడా విశాఖపట్నం నుంచి అంబేద్కర్ నగర్ వచ్చేస్తానని, ముగ్గురం కలిసే ఉందామని ఆమెకు నచ్చ చెప్పింది. దీంతో మొదటి భార్యకు ఏం చేయాలో పాలు పోక షాక్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత తీరుకొని ఆ యువతిని మందలించింది. జరిగిన విషయం తెలుసుకుందామని భర్తను నిలదీసింది. అతడు కూడా ఆ యువతి చెప్పినట్టే జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించాడు. దీంతో కొన్నాళ్లు ఆ భార్య నిర్వేదంలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే విడాకులు ఇచ్చే ద్దామన్నారు. కానీ ప్రేమించిన పాపానికి మనసు చావక ఆ విశాఖపట్నం యువతి చెప్పినట్టే కు నిర్ణయించుకున్నారు. తన భర్తకు ఆ విశాఖపట్నం యువతితో దగ్గరుండి మరి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వివాహానికి విశాఖపట్నం యువతి తరఫున బంధువులు ఎవరు రాకపోవడం గమనార్హం. గతంలోముగ్గురు కలిసి ఉండేందు ఇలాంటి ఘటనలు సినిమాల్లో మాత్రమే కనిపించేవి. కానీ నిజ జీవితంలో ఈ తరహా వాటి ని చూడడం ఇదే మొదటి సారని ఆ ప్రాంత వాసులు చెబుతుండటం గమనార్హం.