Varalaxmi Sarathkumar Biography: విలక్షణ పాత్రలు చేసే సత్తా కొందరికే ఉంటుంది. ముఖ్యంగా నటీమణుల్లో చాలా అరుదుగా ఉంటారు. సౌత్ ఇండియాలో రమ్యకృష్ణ వర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. మనసులు దోచే గ్లామర్ రోల్స్ తో పాటు భయపెట్టే కరుడుగట్టిన విలన్ రోల్స్ కూడా రమ్యకృష్ణ చేశారు. మోడ్రెన్ హీరోయిన్స్ లో రమ్యకృష్ణను మరిపిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్. కరుకైన మాట, నిప్పులు కురిపించే కంటి చూపు వరలక్ష్మి సొంతం. మంచి ఫిజిక్ కి తోడు స్పెషల్ బాడీ లాంగ్వేజ్ తోడు కావడంతో పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ గా వరలక్ష్మి తయారయ్యారు.
-వరలక్ష్మీ బాల్యం విద్యాభ్యాసం
సౌత్ లో లేడీ విలన్ అంటే వరలక్ష్మినే. ముఖ్యంగా తెలుగు తమిళ భాషల్లో ఆమె దున్నేస్తున్నారు. ఈ ఒంగోలు జయమ్మ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ కూతురు వరలక్ష్మీ. 1985 మార్చి 5న బెంగళూరులో వరలక్ష్మి జన్మించింది. రాధిక ఈమెకు స్టెప్ మదర్ అవుతుంది. ఈమె చెన్నైలోని సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చెన్నై నుండి మైక్రోబయాలజీలో డిగ్రీ చేశారు. అలాగే ఎడిన్బర్గ్ యూనివర్సిటీ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ నందు నటనలో శిక్షణ తీసుకున్నారు.
-సినీ కెరీర్
2003లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ బాయ్స్ చిత్రంలో వరలక్ష్మికి ఆఫర్ వచ్చింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కొన్ని కారణాల వలన వరలక్ష్మిని ఆ చిత్రం చేయనీయలేదు. మరో బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమిస్తే కోసం కూడా వరలక్ష్మిని సంప్రదించారు. ఆ ఆఫర్ కూడా చేజారింది. 2012లో విడుదలైన పోడా పోడి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా వరుస చిత్రాలు చేశారు. అయితే వరలక్ష్మి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. తన స్ట్రెంగ్త్ ఏమిటో తెలుసుకున్న వరలక్ష్మి విలక్షణ పాత్రలు చేయడం మొదలుపెట్టారు. 37 ఏళ్ల వరలక్ష్మి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగుతుంది.
విక్రమ్ వేద మూవీలో వరలక్ష్మి భిన్నమైన రోల్ చేశారు. విశాల్ హీరోగా తెరకెక్కిన పందెం కోడి 2లో పూర్తి స్థాయి విలన్ రోల్ చేశారు. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ ఎల్ఎల్బీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. క్రాక్ మూవీలో జయమ్మ పాత్ర వరలక్ష్మికి మంచి ఫేమ్ తెచ్చింది. లేడీ విలన్ అంటే ఇలా ఉండాలన్నట్లు జయమ్మ పాత్రలో వరలక్ష్మి ఒదిగిపోయి నటించారు. వరుసగా పక్కా కమర్షియల్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాల్లో వరలక్ష్మి నెగిటివ్ రోల్స్ చేశారు. పక్కా కమర్షియల్ మినహాయిస్తే వరలక్ష్మి నటించిన అన్ని చిత్రాలు సూపర్ హిట్స్ కొట్టాయి. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో కూడా వరలక్ష్మి కీలక రోల్ చేస్తున్నారు.
-విశాల్ తో ప్రేమ..
ఇక వరలక్ష్మీ తమిళ హీరో విశాల్ తో ప్రేమలో పడిందని.. వీరిద్దరూ పెళ్లికి కూడా రెడీ అయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ శరత్ కుమార్ ను అక్కడి నడిగర్ సంఘం ఎన్నికల్లో ఎదురించిన విశాల్ తో పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వీరి ప్రేమ పెళ్లి ఫలించలేదని సమాచారం. అలా దూరమైన ఈ జంట ఇప్పుడు విడివిడిగా బతుకుతున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా వరలక్ష్మీ విభిన్న పాత్రలతో వెండితెరపై బిజీ ఆర్టిస్టుగా మారారు.