https://oktelugu.com/

Allu Arjun arrested : అల్లు అర్జున్ తప్పేమీ లేకుండానే ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారు అంటూ ఫైర్ అవుతున్న కేటీఆర్…

ప్రస్తుతం అల్లు అర్జున్ పెద్ద ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు... పుష్ప 2 సినిమా సక్సెస్ సాధించిందనే సంతోషం లేకుండానే ఆయన అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో ఉండడం అనేది ఇప్పుడు అతనితో పాటు అతని అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పాలి... మరి ఆయన పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాల్లో కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : December 13, 2024 / 02:51 PM IST

    KTR Reaction on Allu Arjun arrest

    Follow us on

    Allu Arjun arrested : పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే ఆవిడ మృతి చెందడం పట్ల అల్లు అర్జున్ కు బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్ కి రావడమే ఆయన చేసిన పెద్ద తప్పుగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్ భావించి అతని మీద అరెస్టు వారెంట్ ను ఇష్యూ చేసింది. ఇక అందులో భాగంగా చిక్కడ పల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం తనని అదుపులోకి తీసుకున్నారు.ఇక ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన కేటీఆర్ ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో పాలకులకు ఉన్న అభద్రత భావం అనేది పరాకాష్టకు చేరుకుంది. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి వాళ్ల కుటుంబం మీద నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ ఆ రోజు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక పోయిన పాలకులది తప్పు అల్లు అర్జున్ తప్ప ఎలా అవుతుంది. ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. అలాగే హైడ్రా లో చనిపోయిన వల్ల కోసం రేవంత్ రెడ్డి ని ఎందుకు అరెస్టు చెయ్యడం లేదు అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు…

    ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కి కొంతమంది బాసటగా నిలుస్తుంటే మరికొంతమంది మాత్రం అతన్ని అరెస్ట్ చేయాల్సిందే అంటూ అతనికి వ్యతిరేకంగా కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. మరి తను ఈరోజు మొత్తం వాళ్లతోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక తనని విచారించిన తర్వాత కోర్ట్ లో సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇప్పటికే ఆయన తన లాయర్లతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఈ కేసులో కొంతవరకు శిక్షను అనుభవించే పరిస్థితి అయితే ఎదురవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన చేసిన పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో ఏమాత్రం సంతోషం లేకుండా బాధని భరిస్తూ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

    ఇక ఈయన విషయంలో ఎవరు పడితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని విపరీతమైన కామెంట్లు చేయడం విశేషం… రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సైతం ఈ అరెస్టు మీద స్పందిస్తున్నారు. మరి ఫైనల్ గా కోర్ట్ ఇతనికి ఎలాంటి శిక్ష ను విధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…