Custody Movie: టాలీవుడ్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రాల నుండి ఫస్ట్ లుక్స్, క్యారెక్టర్స్ పరిచయం చేశారు. మైఖేల్ మూవీలోని అనసూయ లుక్, కస్టడీ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ ఆకర్షించాయి. సినిమాలపై అంచనాలు పెంచేశాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు-నాగ చైతన్య కాంబోలో కస్టడీ చిత్రం రూపొందుతుంది. నాగ చైతన్య గత చిత్రాలకు భిన్నంగా కస్టడీ చిత్ర పోస్టర్స్ ఉన్నాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్న చైతూని పోలీసులు చుట్టుముట్టడం, గన్స్ ఎక్కుపెట్టడం ఆసక్తి కలిగిస్తుంది. పోలీస్ అయిన నాగ చైతన్య మోస్ట్ వాంటెడ్ ఎలా అయ్యాడనే ఉత్కంఠ రేపుతోంది.

నేడు కస్టడీ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కృతి సినిమా థీమ్ కి తగ్గట్లు ఓ సీరియస్ రోల్ చేస్తున్నారు. కస్టడీ చిత్రంలో ఆమె పాత్ర పేరు రేవతి. కృతిని కటకటాల వెనుక ఉన్నట్లు ఫస్ట్ లుక్ లో పరిచయం చేశారు. దర్శకుడు వెంకట్ ప్రభు సీరియస్ గా సాగే కథలో అంతకు మించి సీరియస్ నెస్, డెప్త్ ఉండేలా… హీరో, హీరోయిన్ పాత్రలు డిజైన్ చేశారనిపిస్తుంది.
మరో చిత్రం మైఖేల్ నుండి అనసూయ లుక్ రివీల్ చేశారు. గొడ్డలి పట్టిన అనసూయ ముఖంలో తీవ్రమైన ఆవేశం కనిపిస్తుంది. ఇక ఆమె క్యారెక్టర్ ని ది మ్యాడ్ క్వీన్ అంటూ పరిచయం చేయడం ఉత్సుకత కలిగిస్తుంది. దర్శకుడు రంజిత్ జయకోడి క్రైమ్ డ్రామాగా మైఖేల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ నటించడం మరో విశేషం.

పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. మైఖేల్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాల సందీప్ కిషన్ గట్టిగా ట్రై చేస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామాలో అనసూయ పాత్ర ఏంటనేది ఆసక్తి కలిగిస్తుంది. ఫస్ట్ లుక్ ద్వారా కీలకమైన సీరియస్ రోల్ చేస్తున్నారని మాత్రం అర్థం అవుతుంది. పుష్ప చిత్రంలో దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ చేసిన మైఖేల్ మూవీలో మరో భిన్నమైన పాత్ర చేస్తున్నారు. మొత్తంగా అనసూయ నటిగా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు.