https://oktelugu.com/

Krithi Shetty: జనసేన ప్రచారంలో బేబమ్మ… ఆమె ఆన్సర్ కి పవన్ ఫ్యాన్స్ ఫిదా!

Krithi Shetty: కృతి శెట్టి ఆన్సర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. దీంతో బేబమ్మను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. విషయంలోకి వెళితే కృతి శెట్టి లేటెస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న విడుదలైంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించగా సుధీర్ బాబు హీరోగా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 16, 2022 / 03:25 PM IST
    Follow us on

    Krithi Shetty: కృతి శెట్టి ఆన్సర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. దీంతో బేబమ్మను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. విషయంలోకి వెళితే కృతి శెట్టి లేటెస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న విడుదలైంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించగా సుధీర్ బాబు హీరోగా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఒక హీరోయిన్ ఆన్లైన్ లోకి వస్తే స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరో గురించి చెప్పాలని ప్రశ్నలు వేస్తారు. ఈ క్రమంలో పలువురు స్టార్స్ గురించి కృతి శెట్టి తన అభిప్రాయం వెల్లడించారు.

    Krithi Shetty

    అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అన్న కృతి… రామ్ చరణ్ అడ్మైరర్ అన్నారు. ఇక మహేష్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. కోలీవుడ్ స్టార్ విజయ్, అజిత్ లను కూడా కృతి పొగడ్తలతో ముంచెత్తింది. కాగా పవన్ ఫ్యాన్స్ ఆయన గురించి కృతి అభిప్రాయం అడిగారు. దానికి కృతి శెట్టి మీకులానే నేను కూడా ఆయనకు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చారు. కృతి సమాధానానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టార్స్ కూడా అభిమానించే ఒకే ఒక హీరో పవన్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

    Also Read: Pawan Kalyan- Ram Charan: చరణ్ దగ్గర అప్పు చేసి తీర్చలేకపోయిన పవన్… ఎంత ఇవ్వాలో తెలిస్తే షాక్ అవుతారు!

    ఈ క్రమంలో ఓ అరుదైన ఫోటో తెరపైకి వచ్చింది. జనసేన అభిమానులు కొందరు గంగిరెద్దు మీద కృతి శెట్టి ఫోటో ఏర్పాటు చేశారు. అలాగే గంగిరెద్దు ఒంటిపై జనసేన జెండా కప్పారు. ఆ ఫోటో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గంగిరెద్దుపై కృతి శెట్టి ఫోటో, జననసేన జెండా చూస్తుంటే ఆమె స్వయంగా పవన్ కోసం ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఈ రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Krithi Shetty

    మరోవైపు కృతి కెరీర్ నెమ్మదించింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన కృతి, తర్వాత వరుసగా రెండు ప్లాప్స్ ఖాతాలో వేసుకుంది. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. లేటెస్ట్ రిలీజ్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫలితం తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే హీరో సూర్యతో మరో చిత్రం చేస్తున్నారు. ఇవి రెండు బైలింగ్వెల్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం.

    Also Read:Balakrishna Rejected Movies: బాలయ్య వద్దనుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే!

    Tags