Mahesh Babu- Krishna Ashes: సూపర్ స్టార్ కృష్ణ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణించి వారం రోజులు గడుస్తున్నా.. ఆయనకు సంబంధించిన విషయాలపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణ ఫ్యామిలీ లోని కొన్ని ఆసక్తికర విషయాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ ఫ్యామిలీ లో దాదాపు అందరూ సినీ రంగానికి చెందిన వారే. ఇందులో భాగంగా వారి గురించి ఏ చిన్న విషయమైనా హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు తండ్రి ఆస్థికలను కలిపే పనిలో బిజీగా మారారు. ఈయన వెంట బావలు సుధీర్ బాబు, గల్లా జయదేవ్ లు ఉన్నారు.కానీ మహేష్ కు అన్న అయిన నరేష్ మాత్రం కనిపించలేదు. దీంతో నరేష్ రాకపోవడానికి కారణం ఏంటి..? వీరి మధ్య గొడవ ఏదైనా జరిగిందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

కృష్ణ ఆస్థికలను హరిద్వార్ లో కలిపేందుకు మహేశ్ ఉత్తరానికి వెళ్లారు. ఆ తరువాత విజయవాడలోని కృష్ణా నదికి వచ్చారు. మహేశ్ కృష్ణా నది కి రాగానే అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే కృష్ణకు ప్రియమైన కొడుకు అయిన నరేష్ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఈ పర్యటనకు నరేష్ కు ఆహ్వానం లేదా..? లేక ఆయన ను పక్కన పెట్టేశారు..? అని అనుకుంటున్నారు. అయితే కృష్ణ మరణం సందర్భంగా నరేష్ ప్రవర్తనపై మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కృష్ణ మరణం తరువాత ఆయన పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడ లో ఉంచారు. ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు, ఇతరులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మహేష్ తో పాటు చాలా ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. కానీ నరేశ్ మాత్రం పవిత్రా లోకేష్ లో కలిసి కనిపించారు. అంతేకాకుండా వీరిద్దరు చేతిలో చేయి వేసుకుని కొంచెం అత్యుత్సాహం చూపించారు. వీరి ప్రవర్తనపై మహేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓ వైపు కృష్ణ మరణంతో తాము దు:ఖం లో మునిగి ఉంటే నరేశ్ మాత్రం చాలా సందడి చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనను మహేశ్ పక్కనపెట్టి నట్లు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాల్లో నరేష్ ను పక్కన బెడితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని పవిత్రా లోకేష్ తో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నారు. అటు పవిత్రా లోకేష్ సైతం తన భర్తను వదిలి నరేష్ తో కలిసి ఉండడానికి సిద్ధమైంది. దీంతో ఇలా వీరు కలిసి ఉండడంపై మహేశ్ ఫ్యామిలీకి నచ్చలేదు. అయితే కృష్ణ మరణం సందర్భంగా వీరి ఓవారక్షన్ తట్టుకోలేక వారిని దూరం పెట్టినట్టు సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.