https://oktelugu.com/

Konaseema Thugs Trailer : కోనసీమ థగ్స్ ట్రైలర్ రివ్యూ… వాల్తేరు వీరయ్య విలన్ నుండి మరో థ్రిల్లింగ్ మూవీ!

  Konaseema Thugs Trailer : డార్క్ క్రైమ్ డ్రామాలకు భారీ ఆదరణ దక్కుతుంది. దీంతో ఈ తరహా కథల పట్ల మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కోనసీమ థగ్స్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో కోనసీమ థగ్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 24న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆకట్టుకుంది. సీరియస్ థీమ్ తో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 18, 2023 / 09:56 PM IST
    Follow us on

     

    Konaseema Thugs Trailer : డార్క్ క్రైమ్ డ్రామాలకు భారీ ఆదరణ దక్కుతుంది. దీంతో ఈ తరహా కథల పట్ల మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కోనసీమ థగ్స్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో కోనసీమ థగ్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 24న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆకట్టుకుంది. సీరియస్ థీమ్ తో సాగింది. క్రైమ్, లవ్ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా కోనసీమ థగ్స్ తెరకెక్కింది. 
     
    అమ్మానాన్నా లేని శేషు కథే కోనసీమ థగ్స్ మూవీ. శేషు ఓ హత్య చేసి జైలుకు వెళతాడు. జైలులో దుర్భరమైన పరిస్థితులు చూస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం జైలు నుండి పారిపోవాలనుకుంటాడు. మరో ఖైదీ సింహాతో కలిసి స్కెచ్ వేస్తాడు. అక్కడ నుండి పారిపోవాలన్న శేషు ప్రణాళిక ఫలించిందా? అసలు శేషు ఎవరు? హత్య ఎందుకు చేశాడు? ఖైదీ శేషు కథ ఎలా ముగిసింది? అనే అంశాల సమాహారంగా కోనసీమ థగ్స్ తెరకెక్కింది. దర్శకుడు బృంద బలమైన ఎమోషన్స్ తో కోనసీమ థగ్స్ తెరకెక్కిందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. 
     
    జైలులో విజువల్స్ చాలా డిస్ట్రబింగ్ గా ఉన్నాయి. దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలతో పాటు క్రైమ్ డ్రామా అలరిస్తుందనిపిస్తుంది. అలాగే రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా దర్శకుడు జోడించారు. హ్రిదు హరూన్ హీరోగా నటించాడు. అనశ్వర రాజన్ హీరోయిన్ గా చేశారు. వీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే బాబీ సింహా సుపరిచితుడే. ఆయన విలన్ గా నటించిన వాల్తేరు వీరయ్య భారీ హిట్ కొట్టింది. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ అయ్యింది. 
     
    ఇక వాల్తేరు వీరయ్యలో విలన్ ప్రకాష్ రాజ్ తమ్ముడిగా కీలక రోల్ చేశాడు బాబీ. గతంలో కూడా పలు తెలుగు సినిమాల్లో నటించాడు. కోనసీమ థగ్స్ మూవీలో బాబీ సింహాది కూడా ప్రధాన పాత్ర. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న క్రమంలో మూవీకి మంచి ప్రచారం దక్కుతుంది. మొత్తంగా కోనసీమ థగ్స్ తెలుగులో మంచి విజయం సాధించే అవకాశం కలదు. ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించారు.