Homeక్రీడలుVirat Kohli: కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ కాదు.. పంజాబ్ తో మ్యాచ్ సత్తాకు నిదర్శనం..!

Virat Kohli: కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ కాదు.. పంజాబ్ తో మ్యాచ్ సత్తాకు నిదర్శనం..!

Virat Kohli
Virat Kohli

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించి ఆర్సీబీ 24 పరుగులు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తాత్కాలిక సారధిగా జట్టుకు వ్యవహరించి విజయాన్ని అందించి పెట్టాడు. ఈ విజయాన్ని అందించి పెట్టడంతో కోహ్లీపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ కాదన్న విషయాన్ని తాజా విజయంతో మరోసారి రుజువు చేశాడని అభిమానులు పేర్కొంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 తర్వాత మళ్లీ ఈ మ్యాచ్ కి కోహ్లీ ఆర్సీబీ సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే బ్యాటింగ్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ తాత్కాలిక సారధిగా జట్టును నడిపించాడు. సుమారు 556 రోజుల తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్ గా బరిలోకి దిగాడు. గతేడాది టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను వదిలేసిన కోహ్లి.. మళ్లీ ఇప్పుడే ఆ జట్టును నడిపించాడు. సూపర్ కెప్టెన్సీ తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించి పెట్టాడు కోహ్లీ.

అద్భుత నిర్ణయాలతో జట్టు విజయానికి కృషి..

పిచ్ కండిషన్స్ కు తగ్గట్టు బ్యాటింగ్ చేయడంతోపాటు మైదానంలో అద్భుత నిర్ణయాలతో జట్టు విజయానికి బాటలు వేశాడు విరాట్ కోహ్లీ. పరిస్థితులకు తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోపాటు బౌలింగ్ మార్పులతో ఫలితాన్ని రాబట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్ సందర్భంగా మూడో ఓవర్ ను స్పిన్నర్ వానిందు హసరంగాతో వేయించి ధాటిగా ఆడుతున్న షార్ట్స్ వికెట్ రాబట్టాడు. మూడు రివ్యూలను సక్సెస్ ఫుల్ గా ఉపయోగించుకున్నాడు మాస్టర్ మైండ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ అద్భుత నిర్ణయాల వల్లే బెంగళూరు జట్టుకు విజయం సాధ్యమైంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆటగాళ్లను మోటివేట్ చేసిన విరాట్ కోహ్లీ..

మ్యాచ్ ఆద్యంతం విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయకమైన ఆట తీరును, సారధ్య బాధ్యతలను నిర్వర్తిస్తూ కనిపించాడు. జట్టు మోరల్ దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు ఆటగాళ్లతో మాట్లాడుతూ మోటివేట్ చేశాడు. బంతులను డాట్స్ చేయడం, పరుగులు ఆపడం కాదని, వికెట్ల లక్ష్యంగా బౌలింగ్ చేయాలని పదేపదే చెప్పి ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడు కోహ్లీ. బ్యాటింగ్ లో ఫాఫ్ డూప్లెసిస్ తో కలిసి తొలి వికెట్ కు 137 పరుగులు భాగస్వామ్యాన్ని అందించాడు కోహ్లీ. ఐపీఎల్ లో 100 సార్లు 30 ప్లస్ స్కోర్లు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టోర్నీ చరిత్రలో 600 ఫోర్లు బాదిన రికార్డును నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

Virat Kohli
Virat Kohli

కోహ్లి కెప్టెన్సీ కి ఫిదా అయిన అభిమానులు..

సుదీర్ఘకాలం తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ ప్రణాళికలు, వ్యూహాలకు అభిమానులు ఫిదా అయ్యారు. కోహ్లీ కెప్టెన్సీ చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఎవడ్రా కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్..? అన్నది అంటూ ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు. కుట్రతో కింగ్ కోహ్లీని సారధ్య బాధ్యతల నుంచి తప్పించారని, అతనిని మించిన సారథి లేడని పరోక్షంగా రోహిత్ శర్మ పై విమర్శలు గుప్పించారు ఆయన అభిమానులు. సరైన టీమ్ ఎంపిక చేయకుండా అనవసర నిర్ణయాలతో కోహ్లీ నీ బద్నాం చేశారని, అతను గొప్ప కెప్టెన్ అని మండిపడుతున్నారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తాజా మ్యాచ్ కోహ్లీ కెప్టెన్సీ సత్తాకు నిదర్శనం అని కొనియాడుతున్నారు. సరైన టీమ్ లేకుండా కేవలం బ్యాటింగ్ తోనే 2016లో ఆర్సీబీని ఫైనల్ కు తీసుకెళ్లాడని గుర్తు చేస్తున్నారు అభిమానులు. సూపర్ టీమ్ తో ఐదు టైటిళ్లు గెలిచిన బెస్ట్ కెప్టెన్ గతేడాది ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు. కుట్ర పూరితంగానే కోహ్లీని సారధ్య బాధ్యతలు నుంచి తప్పించారని, అయినా తన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని అలరిస్తూనే ఉన్నాడని కోహ్లీ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలు వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular