Koffee With Karan Ameer Kareena: కరణ్ జోహార్.. సినీ ప్రముఖులను కూర్చండబెట్టి వారి సెక్స్ లైఫ్ గురించి వ్యక్తిగత విషయాలు అడిగి.. వారు నోరుజారేలా చేసి వారి పరువును గంగపాలు చేసే షోను రన్ చేస్తున్నారు. ‘కాఫీ విత్ కరణ్’ పేరిట జరిగిన ఈ షోలో సమంత విడాకుల విషయం పెంట అయ్యింది. ఇక మంచోడు అనుకున్న మన రౌడీ బాయ్ కారులో, బోటులో శృంగారం చేశాడన్న విషయం బయటపడింది. ఈ దెబ్బతో మన విజయ్ దేవరకొండపై అభిమానుల్లోనూ ఫ్యాన్స్ దృష్టికోణం మారింది. బ్యాడ్ అయిపోయాడు.
కరణ్ జోహార్ షోకు వెళితే జాగ్రత్తగా మాట్లాడకపోతే మంచోడు సైతం బ్యాడ్ అయిపోతాడని తేలిపోయింది. కరెక్ట్ మొగుడు దొరక్కపోతే కరణ్ జోహార్ మరింతగా రెచ్చిపోతారని తేలిపోయింది. కానీ మన మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మాత్రం డిఫెన్స్ లో పడలేదు. ఏకంగా కరణ్ జోహార్ కు దిమ్మదిరిగే కౌంటర్లు ఇచ్చారు. ఇక టాప్ హీరోయిన్ కరీనా కూడా కరణ్ ను కడిగేసింది. వీరిద్దరి కౌంటర్లతో కరణ్ జోహర్ ఎన్ కౌంటర్ అయిపోయాడు. ఏకంగా కరణ్ సెక్స్ లైఫ్ గురించే తిరిగి ప్రశ్నించి అతడిని డిఫెన్స్ లో పడేశారు. నేను వెళ్లిపోతా ఈ షోనుంచి అని కరణ్ అన్నాడంటే అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఏ లెవల్ లో కరణ్ ను ఆడుకున్నారో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు కరణ్ తో అమీర్, కరీనా ‘కాఫీ విత్ కరణ్’ షో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అమీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షోకు గెస్టుగా వచ్చారు అమీర్ ఖాన్, కరీనాకపూర్ లు. ఎప్పుడూ తన ముందున్న ప్రముఖులను సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు అడిగే కరణ్ జోహర్ అదే ఊపులో కరీనా కపూర్, అమీర్ ఖాన్ లను అడిగేశారు. దీనికి కరీనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘నీకు తెలియదా?’ అంటూ ప్రశ్నించింది. దీనికి కరణ్ ‘మా అమ్మ కూడా టాక్ షో చూస్తుంటుంది. నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడితే.. తాను ఏం అనుకుంటుంది’ అంటూ కరణ్ ఏకంగా కరీనాను ఆపే ప్రయత్నం చేశాడు.
దీంతో వెంటనే కరణ్ మాటకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ‘మీ అమ్మ ఇతరుల సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తుంటే ఏం అనుకోదా’ అంటూ కరణ్ మైండ్ బ్లాక్ అయ్యేలా అమీర్ ఖాన్ ప్రశ్నించాడు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతావయ్యా నువ్వు అంటూ కరణ్ జోహార్ ను కడిగేశాడు అమీర్ ఖాన్. దీంతో బెంబేలెత్తిపోయిన కరణ్ ‘నేను ఈ షో ఎండ్ చేసి వెళ్లిపోతా’ అంటూ లేవబోయాడు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక అసలు అమీర్ ఖాన్ కు ఫ్యాషన్ ఏదీ తెలియదు అని.. అందులో మైనస్ అని కరీనా ఎద్దేవా చేస్తుంది. థస్ట్రీ ఫొటో అంటే కూడా తెలియని అమీర్ అమాయకత్వానికి కరణ్, కరీనాలు నవ్వుకుంటారు. ప్రతీసారి అమీర్ పై కరీనా సెటైర్లు వేస్తూనే ఉంటుంది. నన్ను ఇంతలా ఇన్ సల్ట్ చేస్తున్నావ్ అంటూ నవ్వుతూనే అమీర్ వాపోతుంటాడు. ఇప్పుడీ వీడియో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతీ షోలో సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టే కరణ్ జోహార్ ను ఈసారి అమీర్ ఖాన్, కరీనా ఓ ఆట ఆడుకున్నట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. కరణ్ ఇప్పటికైనా ఇతరుల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడకుండా? ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More