Koffee With Karan 7 Trailer: బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సిరీస్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ట్రైలర్ శనివారం సాయంత్రం తాజాగా విడుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలను ఈసారి జంటగా కరణ్ ఇంటర్వ్యూ నిర్వహించి వారి మనోభావాలను అంతరంగికాలను ఆవిష్కరించారు. ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ మూవీలో నటించిన అలియా భట్ -రణవీర్ సింగ్ లతో తొలి ఇంటర్వ్యూ నిర్వహించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సంవత్సరం ఈ షో ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది. ఇది సెలబ్రిటీల అంతరంగాన్ని ఆవిష్కరించనుంది. అనన్య పాండే చుట్టూ వివాదాలపై కరణ్ ప్రశ్నించడం.. వాటిని అనన్య చెప్పినట్టు ట్రైలర్ కట్ చేశారు. అవిప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అక్షయ్ కుమార్ తో గాసిప్ లపై ప్రశ్నలు.. హైలైట్ గా నిలిచాయి. రాపిడ్ ఫైర్ రౌండ్ కూడా అతడితో ఆడించాడు. ఈ సంవత్సరం షోకి అతిధులుగా అలియా భట్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, సమంతా రూత్ ప్రభు, అనన్య పాండే, సారా అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ మరియు కృతి సనన్. హాజరైనట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

కాఫీ విత్ కరణ్ ట్రైలర్ అనుభవజ్ఞుడైన హీరో రణవీర్ సింగ్ నోటి నుంచి ప్రారంభమైంది. దీన్ని “కల్ట్ షో” అని పిలుస్తూ ఆయన ప్రారంభించారు. షోలో అరంగేట్రం చేసిన సమంత రూత్ ప్రభు చేసిన హాట్ కామెంట్స్ ఇందులో ఉన్నాయి. ఒకానొక ప్రశ్నకు “సంతోషకరమైన వివాహాలకు” కరణ్ జోహార్ కారణమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇది తన విడాకుల గురించి సమంత ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అవేంటన్నది షోలోనే తెలుసుకోవాలి. అక్షయ్ కుమార్ ఫిల్టర్స్ కు బదులు “ఫిల్లర్స్” అని నాలుక కరుచుకోవడం కనిపించింది. షాహిద్ కపూర్ ఒంటరిగా ఉండటం గురించి తప్పిపోయిన విషయాలపై సంభాషణలు ఆసక్తి రేపాయి. అనన్యను చిత్ర పరిశ్రమలోకి తీసుకురావడానికి తన తండ్రి చుంకీ పాండే డబ్బు చెల్లించారని ఆమె సంచలన నిజాన్ని పంచుకుంది. సారా అలీ ఖాన్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేసింది.
కరణ్ జోహార్ ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఇది ఉల్లాసంగా ఉందా? ఇది స్పైసీగా ఉందా? ఇది సరదాగా ఉందా? పైన పేర్కొన్నవన్నీ ఈ సీజన్‌ని అత్యంత హాటెస్ట్‌గా మార్చే కొంతమంది అతిథుల నుంచి రాబట్టి నిజాలు’ అంటూ షోపై ఆసక్తిని పెంచాడు. కాఫీ విత్ కరన్ 7వ సీజన్ ఎపిసోడ్స్ ప్రసారం జూలై 7న ప్రారంభమవుతుందని ప్రకటించారు.
2004లో స్టార్ వరల్డ్‌లో ‘కాఫీ విత్ కరణ్’ షో తొలుత ప్రసారమైంది. ఇది 2019 వరకు ఆరు విజయవంతమైన సీజన్‌లలో నడిచింది. షో ప్రారంభ ఎపిసోడ్‌కు షారూఖ్ ఖాన్ మరియు కాజోల్ మొదటి అతిధులుగా వచ్చారు.. కాఫీ విత్ కరణ్ షోలో ప్రముఖుల అంతరంగిక విషయాలు, వారి జీవితంలోని కొన్ని తెరవెనక సంగతులు, గాసిప్‌లు, వైరల్ విషయాలను పంచుకునే వేదికగా మారింది. ఈ షో ఎన్నో వైరల్ విషయాలను బయటపెట్టేలా చేస్తుంది.
షో చివరి సీజన్‌లో బాహుబలి టీమ్ – ఎస్ఎస్ రాజమౌళి, రానా దగ్గుబాటి, ప్రభాస్ లను కరణ్ జోహార్ షోకు అతిథులుగా వచ్చారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎ-లిస్టర్లు – బచ్చన్‌లు, షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కాజోల్, రాణి, కరీనా మరియు ఇతర కపూర్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, అలియా భట్ ఈ షోలో రెగ్యులర్ ముఖాలుగా కనిపించారు. ట్వింకిల్ ఖన్నా, కంగనా రనౌత్ మరియు హార్దిక్ పాండ్యా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు వెల్లడించి ఈ ఎపిసోడ్‌లను పాపులర్ చేశారు. చిత్రనిర్మాతలు జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, మహేష్ భట్, రోహిత్ శెట్టి, ఇంతియాజ్ అలీ మరియు ఫరా ఖాన్ కూడా షోకు అతిథులుగా హాజరయ్యారు. ఈసారి విడాకులపై సమంత చేసిన వ్యాఖ్యలతో ఈ షోలో ఆమె ఎలాంటి విషయాలు పంచుకున్నదన్నది ఆసక్తి రేపుతోంది.
[…] […]