Homeట్రెండింగ్ న్యూస్Koa Bun Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా.. పొట్టకూటికోసం పనిచేసే వ్యక్తిపై ఇంత పైత్యమా?

Koa Bun Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా.. పొట్టకూటికోసం పనిచేసే వ్యక్తిపై ఇంత పైత్యమా?

Koa Bun Controversy: ఓ ఆర్ ఎస్ తాగకండి.. అది శరీరంపై దాడి చేస్తుంది. అది ఒక రకమైన తీపి విషం.. ఇవి విషయాలను చెబుతూ డాక్టర్ శివరంజని 8 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. నాడు ఆమె చేస్తున్న పోరాటంలో ఎవరు కూడా మద్దతుగా నిలవలేదు. చివరికి ఆ ఓ ఆర్ ఎస్ కంపెనీల వద్ద 180 కోట్ల విలువైన సరుకు ఇంకా ఉందట. ప్రభుత్వం విక్రయించకూడదని చెప్పినప్పటికీ ఆ కంపెనీలు అమ్ముతూనే ఉన్నాయి. జనం కొంటూనే ఉన్నారు.

కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక్కసారి గూగుల్ చేసి చూస్తే అందులో ఉన్న అనర్ధాలు మొత్తం మనకు తెలుస్తాయి. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తాగొద్దని అనేక సంస్థలు చెబుతున్నప్పటికీ జనం మారడం లేదు. వాటిని మానుకోవడం లేదు. అడ్డదిడ్డమైన తిండి తిని.. అడ్డంగా ఒళ్లను పెంచి చివరికి రోగాలు తెచ్చుకుంటున్నారు. గుండెపోటులతో కన్నుమూస్తున్నారు.

ఆమధ్య ఓ పిల్లాడు గుట్కా తింటూ కనిపించాడు. ఇదేంట్రా బాబు తినకూడదు కదా అని అడిగితే.. బాలీవుడ్లో షారుక్ ఖాన్ తింటున్నాడు.. అక్షయ్ కుమార్ కూడా తింటున్నాడు. వాళ్ళు ఏకంగా యాడ్స్ కూడా చేస్తున్నారు. వాళ్లు తింటే చనిపోలేదు కదా.. మరి నేను తింటే ఏమవుతుంది అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన వాళ్ళ అతి తెలివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలు డబ్బు కోసం దిగజారుతున్న క్రమంలో ఇలాంటి ప్రకటనలు.. పనికిమాలిన ఉత్పత్తులు.. ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేసే గుట్కాలు చాలానే వస్తూ ఉంటాయి.

షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ గుట్కా యాడ్స్ చేసినప్పుడు.. అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వంటి వారు కూల్ డ్రింక్స్ కు ప్రమోషన్ చేసినప్పుడు మీడియా వారి మూతిలో మైక్ పెట్టి అడిగిందా ఎప్పుడైనా.. మీడియాకు అలా అడిగే దమ్ము ఉండదు..

ఇటీవల అనసూయ దుస్తుల మీద వీర విహారం చేసిన కొంతమంది యూట్యూబర్లు.. ప్రభాకర్ కొడుకు బూతు పాట పాడేసరికి.. వాడిని కన్నా, నాన్నా అంటూ నక్క వినయం నటించారు. ఈ ఎదవ సంతకు ఎక్కడ నోరు పెగిలించాలో తెలిసి చావదు. అమాయకులు దొరికితే చాలు మీద పడతారు. పనికిమాలిన టిఆర్పి ల కోసం.. ఫేమస్ అవడం కోసం దారుణానికి దిగజారుతారు.

అతడు ఎవరో కర్నూలు నుంచి వచ్చాడు. మేడారం జాతరలో బన్ను క్రీము అమ్ముతున్నాడు. ఆ బన్ను అతడు తయారు చేసిందే. క్రీము కూడా అతడు రూపొందించిందే. ఒకవేళ ఇదే బన్ను, క్రీము నిలోఫర్ కేఫ్ బాబురావు తయారు చేసి ఉంటే ఇదే మీడియా లో పనిచేసేవారు వేలకు వేలు తగలేసి కొనేవారు. వారేవా.. మా జన్మ ధన్యమైంది అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఒక సామాన్యుడు పొట్టకూటి కోసం తెలిసిన పని చేసుకుంటే మాత్రం ఓర్వలేక పోతున్నారు . ఇదేం జర్నలిజం రా బై.. కట్టకట్టుకుని ఎక్కడైనా చావండి.. అని అనాలనిపిస్తోంది. హార్ష్ గా ఉన్నా సరే తప్పడం లేదు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular