Love Breakup : కొత్తగా ప్రియురాలి లభించిందంటే వారికి ‘బర్రె ఈనినంత’ ఆనందం ఉంటుంది. మోటుగా అన్నా ఆ ఆనందం.. పిచ్చి, వ్యామోహంలో ఏం చేస్తున్నామో ఎవరికీ తెలియదు. ప్రియురాలితో పార్కులు, సినిమాలు, షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. ఆమె కోసం అప్పులు చేసి మరీ ఆమె అవసరాలు తీరుస్తుంటాం..

అయితే ఈ ఆధునిక కాలంలో అమ్మాయిలను మెయింటేన్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. లక్షలు పోస్తే కానీ వారిని భరించలేని పరిస్థితి. వారి గొంతెమ్మ కోర్కెల్ తీర్చడం.. ఇందుకోసం నానా ఇబ్బందులు పడడం చూస్తూనే ఉంటాం.
అయితే ప్రేమలో ఉన్నప్పుడు ఈ విషయాలు ఎప్పుడూ ప్రియురాలికి చెప్పొద్దు.. అలా చెప్పారో ఇక మీకు విడాకులు అయినట్టే లెక్క. ఇద్దరూ ప్రేమ ఆదిలోనే విడిపోవడం ఖాయం.. కొన్ని విషయాలు పంచుకోవడం వల్ల మీ ప్రేయసికి కోపం వచ్చి బ్రేకప్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..

-ముఖ్యంగా మన ప్రేమిస్తున్న ప్రేయసి మన పాత ప్రేమ విషయాలు.. మాజీ ప్రేయసి గురించి అస్సలు చెప్పొద్దు. అలా చెబితే మీరు విడిపోవడం ఖాయం..
-ఇక ప్రేమిస్తున్న అమ్మాయి ముందు ఇతర అమ్మాయిలను పొగిడినా.. కనీసం చూసినా మీ ప్రేమ బ్రేకప్ కు దారితీయడం ఖాయం..
-ఇక డబ్బులున్నా.. లేకపోయినా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పదే పదే చెబితే మీ కేపాసిటీ తెలిసి వారు విసుగు చెందిన దూరం అవుతారు.మీ గొప్పలకు పోయి చెప్పారో విడిపోవడం ఖాయం..

-ఇక ప్రియురాలి దుస్తులపై ఎంత తక్కువ కామెంట్ చేస్తే అంత మంచిది. అవహేళన చేసినా.. డ్రెస్ బాగాలేదన్నా విడిపోయే అవకాశాలుంటాయట..
-ఇక స్త్రీలను ఎప్పుడూ ఇతరులతో పోల్చవద్దు. అలా పోల్చారో ఇక మీరు చచ్చినట్టే. వారికి అలా అస్సలు ఇష్టం ఉండదు. ప్రేయసిని ఇతరులతో పోలిస్తే మీ నుంచి ఆమె దూరంగా జరగడం ఖాయం.