
Kiccha Sudeep Letter: కిచ్చా సుదీప్ వ్యవహారం శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పార్టీలో చేరితే మీ ప్రైవేట్ వీడియో బయటపెడతానంటూ ఓ లేఖ ఆయనకు చేరింది. ఈ బెదిరింపు లేఖకు భయపడిన సుదీప్ బీజేపీ పార్టీలో చేరలేదన్న వాదన వినిపిస్తోంది. సీఎం బసవరాజ్ బొమ్మై హీరో కిచ్చా సుదీప్ కి అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలో బెదిరింపు లేఖ వ్యవహారాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారట. విచారణ చేపట్టారట.
సుదీప్ ని బెదిరించింది ఆయన మాజీ కారు డ్రైవర్ అని అనుమానిస్తున్నారు. చాలా కాలంగా తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ ని సుదీప్ ఇటీవల తొలగించినట్లు సమాచారం. అతడే ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటారని పలువురు నమ్ముతున్నారు. ఈ అనుమానాలు బలపరిచే విధంగా డ్రైవర్ ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. అతడు పరారీలో ఉన్నాడు. నిజంగా బెదిరించింది తనేనా? లేక భయపడి పారిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.

సుదీప్ ఆ లేఖకు భయపడ్డారని ప్రచారం అవుతుంది. ఈ క్రమంలో సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగా ఉందా? అందుకే అతడు భయపడుతున్నాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక బీజేపీకి సుదీప్ మద్దతు తెలపడాన్ని నటుడు ప్రకాష్ రాజ్ వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా సుదీప్ మీద సూటి ప్రశ్నలు సంధించారు. బీజేపీ పాలనకు, పాలసీలకు ప్రకాష్ రాజ్ వ్యతిరేకి. బీజేపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుంటాడు. ప్రకాష్ కర్ణాటక రాష్ట్రం వారే. మే 10వ తేదీన ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కాగా గత ఏడాది సుదీప్ నటించిన విక్రాంత్ రోనా విడుదలైంది. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన విక్రాంత్ రానా మంచి విజయం అందుకుంది. ఇటీవల విడుదలైన మరో కన్నడ భారీ చిత్రం కబ్జలో సుదీప్ గెస్ట్ రోల్ చేశారు. ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జ నిరాశపరిచింది. ఈగ, బాహుబలి, సైరా చిత్రాల్లో సుదీప్ కీలక రోల్స్ చేశారు.