Khushi Re Release: పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు..తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఒక మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రం ఖుషి..తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం లో తెరకెక్కిన ఈ అర్బన్ లవ్ స్టోరీ అప్పటి వరుకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..పవన్ కళ్యాణ్ ని యూత్ ఐకాన్ గా మార్చి అనితరసాధ్యమైన రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ చిత్రం.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినిమాలు తియ్యడానికి గ్యాప్ ఇచ్చాడు..ఆ గ్యాప్ లో ఖుషి మూవీ ని ఆ చిత్ర నిర్మాత AM రత్నం 160 ప్రింట్స్ తో మరోసారి రీ రిలీజ్ చేసారు..ఆరోజుల్లో రీ రిలీజ్ లో కూడా సరికొత్త చరిత్ర ని సృష్టించింది ఈ చిత్రం..అప్పట్లోనే 24 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాని ఈ నెల 31 వ తారీఖున మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
ఈ చిత్రాన్ని కొద్ది రోజుల క్రితమే నిర్మాత AM రత్నం 4K క్వాలిటీ మరియు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో రీ రిలీజ్ కోసం ప్రింట్స్ తయారు చేయించాడు..వింటేజ్ పవర్ స్టార్ లుక్స్ ని వెండితెర మీద అంత క్వాలిటీ తో చూస్తే అభిమానులకు పూనకాలు వచ్చినట్టే అని చెప్పొచ్చు..ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా వేశారు..ఈ షోస్ నుండి సుమారుగా 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు..ఇప్పటి వరుకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ లు అయ్యాయి కానీ ఒక్క చిత్రం కూడా ఆ రికార్డు ని అందుకోలేకపోయింది..ఇప్పుడు ఖుషి చిత్రం ఆ రికార్డు ని అలవోకగా బద్దలు కొడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు..ఇక ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ మూడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మూడు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.