Naresh-Pavitra Lokesh: నరేష్-పవిత్ర లోకేష్ ల వ్యక్తిగత జీవితాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఇదో అంతం లేని మెగా సీరియల్ లా కొనసాగుతుంది. కొన్ని నెలల క్రితం వరుస కథనాలతో పెద్ద హైడ్రా నడిచింది. తాజాగా పవిత్ర లోకేష్ సైబర్ సెల్ లో ఫిర్యాదు చేయడంతో కొత్త వివాదానికి తెరలేపింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయి. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నారని పవిత్ర ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పేరు పొందుపరిచారు. యూట్యూబ్ ఛానల్స్ తో ఆమె కావాలని ప్రచారం చేయిస్తున్నారు. మాపై కుట్ర పన్నుతున్నారు. నరేష్ పై నాపై జరిగే దుష్ప్రచారానికి కారణం రమ్య రఘుపతి అని పవిత్ర లోకేష్ ఆరోపించారు. గతంలో తమపై దాడికి ప్రయతించిన రమ్య రఘుపతి వెనకుండి అసభ్యకర పోస్ట్స్ పెట్టిస్తున్నారు. నిరాధార కథనాలు ప్రచురిస్తున్నారని పవిత్ర లోకేష్ కీలక ఆరోపణలు చేశారు. దీంతో సోషల్ మీడియా వేధింపుల కేసు కొత్త మలుపు తీసుకుంది.
పవిత్ర లోకేష్ ఆరోపణల నేపథ్యంలో రమ్య రఘుపతి ఎలా స్పందింస్తారనేది చూడాలి. నరేష్-పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారని కథనాలు రావడంతో రమ్య రఘుపతి ఫైర్ అయ్యారు. చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా నరేష్ వేరే మహిళను వివాహం ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించారు. అయితే తాను పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకోలేదని నరేష్ మీడియా ముందు వివరణ ఇచ్చారు. మైసూర్ లోని ఒక హోటల్ గదిలో పవిత్ర-నరేష్ ఉన్నారని తెలుసుకున్న రమ్య ఆ గది ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, పవిత్ర, నరేష్ లను పంపివేశారు.

హోటల్ గది నుండి బయటకొచ్చిన పవిత్ర, నరేష్ లపై రమ్య చెప్పుతో దాడి చేయబోయారు. కాగా నవంబర్ 15న కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ తదుపరి రోజు ప్రముఖుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోలో పార్థివదేహం ఉంచారు. కృష్ణను చివరి చూపు చూసేందుకు రమ్య రఘుపతి అక్కడకు వచ్చారు. అదే సమయంలో నరేష్-పవిత్ర కృష్ణ భౌతికకాయం వద్ద ఉన్న రమ్య రఘుపతి ఎదురుపడ్డారు. ముగ్గురూ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కృష్ణతో రమ్యకు కూడా అనుబంధం ఉంది. కృష్ణ రెండో భార్య విజయనిర్మల, నరేష్ వద్దే ఉండేవారు. నరేష్ భార్యగా కృష్ణ ఉన్న ఇంట్లోనే రమ్య రఘుపతి ఉన్నారు.