
MLC Kavitha Troll: ‘వేయు శుభములు కలుగునీకు పోయిరావే మరదలా…’ శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలోని ఈ పాటు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 1960లో తీసిన ఈ సినిమా పాట ఇప్పుడు ఎందుకు అంత వైరల్ అవుతోందని ఆశ్చర్యపోతున్నారా.. దానికీ ఓ కారణముంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారాల బిడ్డ, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముద్దుల చెల్లి.. కల్వకుంట్ల శైలిమ(కేటీర్ భార్య) ముద్దుల మరదలు.. కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు వెళ్లడమే. విచారణకు.. ఈ పాటకు సబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా.. అలా లిక్ చేశారు మరి కవితంటే గిట్టనివారు. ఈ పాటలో శ్రీకృష్ణుడి చెల్లి సుభద్రను, ఆమె వదిన అత్తారింటికి సాగనంపుతున్న సంరద్భంగా ఈ పాటను తెరకెక్కించారు. ఆ పాటను ఈడీ విచారణకు వెళ్తుక్న కవితను శైలిమ సాగనంపుతున్నట్లుగా ఎడిట్‌చేసి ట్రోల్ చేస్తున్నారు.
లైకులు, కామెంట్లు..
సుభద్ర క్యారెక్టర్‌ను కవితగా, ఆమె వదిన పాత్రను శైలిమగా పేర్లు జతచేశారు. అక్కడ కోరస్ పాడుతున్న బంధుగణం, చెలికత్తెలను పింకీల బానిసలు అని రాసి మరీ పాటను ట్రోల్ చేస్తున్నారు. కవిత ఢిల్లీకి వెళ్తున్నప్పుడు నిజాం దొర ఇంట్లో ఫ్యామిలీ సాంగ్ అంటూ ట్యాగ్‌చేసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీనికి నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. అంతేకాదు తమకు నచ్చిన కామెంట్స్ పెడతున్నారు. ఎవరూ కూడా కవితకు అనుకూలంగా, పాజిటివ్‌గా కామెంట్ పోస్ట్ చేయకపోవడం గమనార్హం.

కామెంట్స్ ఇలా..
ఇక కామెంట్స్ విషయానికి వస్తే.. ఇక మళ్లీ రాదు.., పాట వ్యాల్యూ పోయింది బ్రో.., ఈ పాట మ్యాచ్ కాలేదు.. ఏదైనా జైలు పాట పెట్టండి.., సూపర్.., ప్లీజ్ డోంట్ యూస్ గ్రేట్ సాంగ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రామా.., ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈవీడియో చూసినవారిలో 25 శాతం దీనిని షేర్ చేస్తున్నారు.
మొత్తానికి కవిత కష్టం చూస్తుంటే.. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దనిపిస్తుంది. గతంలో ఎవరూ ఇంతలా ట్రోల్ కాలేదు. ఫాఫం కవిత!