
Karthikeya On Oscar: దేశ సినీ ఇండస్ట్రీ ఆస్కార్ సంబరాల్లో మునిగిపోయింది. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు లభించడంతో పండుగ చేసుకుంటున్నారు. యావత్ దేశ సినీ పరిశ్రమ గర్వించేలా ప్రపంచ అవార్డు తెలుగు సినిమా సొంతం కావడంతో టాలీవుడ్ జోష్ లో ఉంది. దక్షిణాదిన ఆస్కార్ పొందిన తొలి చిత్రంగాను రికార్డుకెక్కడంతో ఆనందానికి హద్దు లేకుండాపోయింది. ఎనిమిది దశబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఈ అవార్డు రాలేదు. కానీ జక్కన్న చేసిన మాయతో ఇప్పుుడు ప్రపంచ వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవడం హర్షించదగిన విషయం అంటున్నారు. అయితే ‘నాటు నాటు’కు అస్కార్ అవార్డు రావడం వెనుక కార్తీకేయ మాస్టర్ మైండే కారణమని అనుకుంటున్నారు. ఆయన చేసిన కృషితోనే నాటు నాటుకు ఆస్కార్ లభించిందని అంటున్నారు.
రాజమౌళి గారాల పుత్రుడే కార్తీకేయ. రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడంటే బయటి వారి కంటే తన కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి సతీమణి రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేస్తున్నారు. మ్యూజిక్ అందించే కీరవాణి రాజమౌళికి చిన్నాన్న కాగా.. ఆయన కుమారుడు కాలభైరవ కూడా రాజమౌళి కంపెనీలో వర్క్ చేస్తున్నారు.
ఇక రాజమౌళి కుమారుడు కార్తీకేయ సైతం ప్రతీ సినిమాల్లో కీలకంగా ఉంటారన్న విషయం చాలా మందికి తెలియదు. కార్తీకేయ బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ రాజమౌళి తీసే సినిమాలో ఆయన మార్క్ ఎక్కువగా ఉంటుందనేది టాక్. కొన్నాళ్లు టెక్నీషియన్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు లైన్ ప్రొడ్యూస్ స్థాయికి ఎదిగారు. బాహుబలి సినిమాలను వరల్డ్ వైడ్ లో తీసుకెళ్లింది కార్తీకేయేనని చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వెనుక ఆయన కృషి ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ రూపకల్పన చేయాలన్న సలహా ఆయనదే. ఈ సాంగ్ చిత్రీకరణ, తదితర విషయాలను ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇక సినిమాను ప్రమోట్ చేయడంలో కార్తీకేయకున్న స్ట్రాటజీ మాములుది కాదు. ఈ సినిమాకు ఉన్న బజ్ ను దృష్టిలో ఉంచుకొని అస్కార్ అప్రూవ్డ్ థియేటర్లలో ప్రదర్శించేలా కార్తీకేయ చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత వెస్ట్రన్ కంట్రీస్ లో ఆర్ఆర్ఆర్ కు వచ్చిన క్రేజ్ తో ఫర్ యువర్ కన్సిడరేషన్ కింద జనరల్ క్యాటగిరీలో అస్కార్ ను అప్లయ్ చేశారు. టీసీఎల్ లాంటి థియేటర్లలో సినిమాను ప్రదర్శించటంతో ఆర్ఆర్ఆర్ కు భారీ స్పందన వచ్చింది. ఆలోగా వెరనైటీ మ్యాగజైన్ లాంటి ఆస్కార్ గురించి మరింత ప్రచారంచేశారు.
వీటీతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అమెరికాలోని థియేటర్లలో తిప్పుతూ ప్రేక్షకులను పరిచయం చేశారు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మరింత ప్లస్ పాయింట్ గా మారింది. ఇంకోవైపు జపాన్ లో సినిమాను రిలీజ్ చేయించడం కూడా కార్తీకేయ ప్లాన్ లో భాగమే అంటున్నారు. వీటి ఫలితంగానే అంతర్జాతీయంగా వివిధ వేదికలపై నాటు నాటు సాంగ్ కు పలు అవార్డులు వచ్చాయి. ఇప్పుడే ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ ‘థ్యాంక్యూ కార్తీకేయ’ అని అన్నారు. దీంతో ఆయన చేసిన కృషితోనే అస్కార్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
#RRRMovie composer M. M. Keeravani accepts the original song #Oscar for “Naatu Naatu” and graces the audience with a tune of his own. https://t.co/hxuR41IpLt pic.twitter.com/t4pbTwAE1M
— Los Angeles Times (@latimes) March 13, 2023