Karthikeya 2- Sita Ramam: OTT కి ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోవడం వల్లో ఏమో తెలీదు కానీ..ఈమధ్య సూపర్ హిట్ సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ బాగా తగ్గిపోతున్నాయి..థియేటర్స్ లో ఊహకి అందని రన్ ని దక్కించుకున్న ఎన్నో సినిమాలకు టీవీ టెలికాస్ట్ లో మాత్రం అందులో సగం రెస్పాన్స్ కూడా రాకపోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..అందుకు రీసెంట్ ఉదాహరణగా నిలిచాయి మరో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..ఈ ఏడాది ట్రేడ్ వర్గాల అంచనాలను కూడా దాటి బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించిన సినిమాలు సీత రామం మరియు కార్తికేయ 2.

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపేసాయి..కార్తికేయ 2 సినిమా అయితే హిందీ లో బడా సినిమాలను సైతం వెనక్కి నెట్టి 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది..ఇది మాములు విషయం కాదు..వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక సీత రామం సినిమా అయితే తెలుగు లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది..కానీ బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లో చేరి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది..బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి అద్భుతాలు సృష్టించిన ఈ రెండు సినిమాలు రెండు వారాల క్రితం జీ తెలుగు లో మరియు మా టీవీ లో ఒకే సమయం లో టెలికాస్ట్ అయ్యాయి..జీ తెలుగు లో ప్రసారమైన కార్తికేయ 2 కి 7.88 టీఆర్ఫీ రేటింగ్స్ మరియు మా టీవీ లో ప్రసారమైన సీతారామం కి 8.73 రేటింగ్స్ వచ్చాయి.

ఈ రెండు సినిమాలు ఒకే సమయం లో కాకుండా వేర్వేరు వారాల్లో టెలికాస్ట్ అయ్యి ఉంటె కచ్చితంగా కాస్త బెటర్ రేటింగ్స్ వచ్చి ఉండేవని విశ్లేషకులు చెప్తున్నమాట..OTT లో కూడా ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ..థియేట్రికల్ రెస్పాన్స్ తో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు.