Kantara On Oscar: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు ఊహకి అందని అద్భుతాలు సృష్టించాయి..వాటిల్లో మనం ముందుగా ‘కాంతారా’ గురించి మాట్లాడుకోవాలి.. కన్నడ లో ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమాగా అవతరించింది..కన్నడతో పాటుగా తెలుగు మరియు హిందీ భాషలలో ఇరగదీసింది ఈ చిత్రం.. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా బాక్స్ ఆఫీస్ వసూళ్లను రాబట్టింది అంటే కంటెంట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా ఇప్పుడు నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు దక్కించుకోబోతోంది..త్వరలో జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం అన్ని విభాగాలలో ఈ చిత్రాన్ని నామినేషన్స్ కి పంపినట్టు సమాచారం.. #RRR చిత్రాన్ని కూడా 14 క్యాటగిరీలలో నామినేషన్స్ కి పంపించారు.. ఈ నామినేషన్స్ లో ఇప్పటివరకు ‘నాటు నాటు’ సాంగ్ ఒక్కటే షార్ట్ లిస్ట్ అయ్యింది.
మిగిలిన వాటిల్లో ఎన్ని షార్ట్ లిస్ట్ అవుతాయో చూడాలి..అయితే #RRR చిత్రం కంటెంట్ పరంగా కాంతారా తో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు..ఒక మామూలు లో బడ్జెట్ సినిమాని జనాలు అలా ఎగబడి చూశారంటే కచ్చితంగా అందులో ఏదో సరికొత్త విషయం వాళ్లకి ఆకర్షించి ఉంటుంది కదా..అలా సౌత్ నుండి వెళ్లిన ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే #RRR కంటే కాంతారా కి ఎక్కువ క్యాటగిరీలలో నామినేషన్స్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం..ఇక #RRR సినిమాకి పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ దక్కిన సంగతి తెలిసిందే.

ఇందులో నటించిన హీరోలకంటే ఎక్కువగా డైరెక్టర్ రాజమౌళి కి నామినేషన్స్ లో చోటు దక్కింది..పేరు ప్రఖ్యాతలు కూడా అన్నీ ఆయనకే..కానీ బాహుబలి సిరీస్ కి మాత్రం రాజమౌళి తో సమానంగా ప్రభాస్ కి కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..ఇక కాంతారా విషయానికి వస్తే ఈ చిత్రానికి దర్శకుడు/హీరో రిషబ్ శెట్టి మరో లెవెల్ కి వెళ్ళిపోయాడు..ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటనకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్స్ లో చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
తాజా అప్డేట్ ఏంటంటే.. ఆస్కార్ అవార్డుల కోసం ‘కాంతారా’ తరుఫున దరఖాస్తు పంపించినట్లు ఆ సినిమా నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న ఈ సినిమా అని.. ఫైనల్ నామినేషనల్స్ లిస్ట్ ఇంకా రావాల్సి ఉన్నందున తాము కూడా దరఖాస్తు చేసుకున్నట్లు కాంతారా టీం తెలిపింది.