Kanch Gachibowli : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకుంది. వాటికి బదులుగా గోపన్ పల్లి ప్రాంతంలోని సర్వే నెంబర్లు 36, 37 ప్రాంతాలలోని 397 ఎకరాలను అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి స్వాధీనం చేసింది. అప్పటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ వై నర్సింహులు సంతకం చేశారని ప్రభుత్వం ఒక ఆధారాన్ని విడుదల చేసింది. ఇక సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ మంత్రులు ఇదే విషయాన్ని వెల్లడించారు.. మరి ఆ 397 ఎకరాలు ఇప్పుడు ఏమయ్యాయి? అవి సెంట్రల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయా? కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలపై వివాదం ఎందుకు చెలరేగుతున్నది?
Also Read : గచ్చి బౌలి లో ఆ 400 ఎకరాల వెనుక అసలు కథ ఇది..
అక్కడ భూమి ఉన్నదా?
గోపనపల్లి లోని సర్వే నెంబర్లు 36, 37 లో 884 ఎకరాల భూమి ఉంది.. ఇందులో 447 ఎకరాలను టీఎన్జీవోలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1991లో కేటాయించారు. అనంతరం అనేక సంస్థలకు ప్రభుత్వాలు ఇక్కడ భూములు కేటాయించాయి. ఇక్కడ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFER) ను ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 250 కూడా భూమి కేటాయించారు. ఇక ఈ సర్వే నెంబర్ లో 90 ఎకరాల భూమి తనదే అంటూ ఓ వ్యక్తిని కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఒక రీసెర్చ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. గోపన పల్లి ప్రాంతంలో లాయర్ల సంఘానికి గతంలో 20 ఎకరాలు కేటాయించారు. అయితే ఇన్ని కేటాయింపులు జరిగిన తర్వాత.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన భూమి అసలు అక్కడ ఉందా? ఒకవేళ భూమి ఉంటే అది యూనివర్సిటీ ఆధీనంలోనే ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ భూములపై యూనివర్సిటీకి ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండవు. పైగా భూములపై ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. అందువల్లే వివిధ సంస్థలకు, పరిశ్రమలకు ప్రభుత్వం భూమి కేటాయింపులు జరుపుతోంది. ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చట్టబద్ధత ఉంది అనే విషయాన్ని తేల్చడానికి 2016లో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేయించింది. అయితే వారు అప్పట్లో నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నది. నాడు కంచ గచ్చిబౌలి ప్రాంతంలో భూములపై ప్రభుత్వానికి ఆసక్తి లేకుంటే.. అధికారులతో బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేసిందని.. ఆ నివేదికను ఎందుకు బయట పెట్ట లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆ 400 ఎకరాలకు సంబంధించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో.. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : వైరల్ వీడియో: మహీంద్రా టీయూవీ 300 టయోటా ఫార్చునర్ ను పడగొడితే ఇలానే ఉంటుంది